ఏపీలో భారీగా అదనపు ఎస్పీల బదిలీలు
ఏపీలో భారీగా అదనపు ఎస్పీల బదిలీలు జరిగాయి. పలువురు నాన్ కేడర్ ఎస్పీలతో పాటు అదనపు ఎస్పీలకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న

ఏపీలో భారీగా అదనపు ఎస్పీల బదిలీలు జరిగాయి. పలువురు నాన్ కేడర్ ఎస్పీలతో పాటు అదనపు ఎస్పీలకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న
ఏపీలో భారీగా అదనపు ఎస్పీల బదిలీలు జరిగాయి. పలువురు నాన్ కేడర్ ఎస్పీలతో పాటు అదనపు ఎస్పీలకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఐదుగురికి పోస్టింగ్‌లు లభించాయి. మరో 20 మంది డీఎస్పీలకు అడిషనల్ ఎస్పీలుగా.. 12మంది నాన్ కేడర్ ఎస్పీలకు అడిషనల్ ఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చింది. పలువురికి పోస్టింగ్ ఇచ్చింది. సోమవారం(ఫిబ్రవరి 17,2020) రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
* విశాఖపట్నం సిటీలో క్రైమ్స్ డీసీపీగా పనిచేస్తున్న వి.సురేష్ బాబును అక్కడే కొనసాగిస్తూ ఆర్.గంగాధర్ రావును ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా బదిలీ.
* మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ఓఎస్‌డీగా పనిచేసిన ఎ.వెంకటరత్నంను మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో శాంతిభద్రతల ఏఐజీగా బదిలీ
* మోహన్‌రావును ఇంటెలిజెన్స్‌కు, టి.గంగాధరంను కర్నూలుకు.. సీఐడీలో ఉన్న మేరీ ప్రశాంతిని విజయవాడ సిటీ అడ్మిన్ డీసీపీగా పోస్టింగ్
* రెడ్ శాండల్ టాస్క్‌ఫోర్స్ నుంచి వెంకట రవికుమార్‌ను ఏసీబీ జేడీగా బదిలీ
* ఏపీ ఎస్పీ మూడో బెటాలియన్ కమాండెంట్ శ్రీరామమూర్తిని 14వ బెటాలియన్‌కు
* కమాండెంట్ నాగరాజును హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌కు, వెయిటింగ్‌లో ఉన్న సత్తిబాబు ఏసీబీ
* వెయిటింగ్‌లో ఉన్న అడిషనల్ ఎస్పీ సుప్రజను తిరుపతి అడ్మిన్‌కు, అడిషనల్ డీసీపీ ఎం.రజనీని విశాఖ సిటీకి ట్రాన్సఫర్
* ఏసీబీలో ఫైర్‌బ్రాండ్‌గా పనిచేసిన ఎ.రమాదేవిని విశాఖపట్నం మెరైన్‌కు బదిలీ
* ఇంటెలిజెన్స్‌లో ఉన్న కరీముల్లా షరీఫ్‌ను పశ్చిమ గోదావరి అడ్మిన్‌గా, వెయిటింగ్‌లో ఉన్న చౌడేశ్వరికి మార్కాపురం ఓఎస్‌డీగా పోస్టింగ్