కృష్ణమ్మ ఉరకలు : మళ్లీ శ్రీశైలం గేట్ల ఎత్తివేత

  • Published By: madhu ,Published On : September 28, 2019 / 02:54 AM IST
కృష్ణమ్మ ఉరకలు : మళ్లీ శ్రీశైలం గేట్ల ఎత్తివేత

Updated On : September 28, 2019 / 2:54 AM IST

కృష్ణమ్మ మళ్లీ ఉరకలు వేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది. రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల వద్ద భారీ ఇన్‌ఫ్లోలు నమోదవుతున్నాయి. ఎగువున ఉన్న ఆల్మట్టి, ఉజ్జయిని, తుంగభద్రకు సెప్టెంబర్ 27వ తేదీ శుక్రవారం ఉదయం భారీగా వరద నీరు వచ్చి చేరింది.

సాయంత్రానికి కొంత తగ్గుముఖం పట్టిందని అంటున్నారు అధికారులు. సెప్టెంబర్ 28వ తేదీ శనివారం కూడా తెలుగు రాష్ట్రాల పరిధిలోని ప్రాజెక్టులకు వరద ఉధృతి కంటిన్యూ కావచ్చని అంచనా వేస్తున్నారు. జూరాలకు వరద ప్రవాహం పెరగడంతో ప్రాజెక్టు 19 గేట్లను ఎత్తి దిగువను నీటిని విడుదల చేశారు. జూరాలతో పాటు సంకేశుల నుంచి భారీగా ఇన్ ఫ్లో వస్తుండడంతో శ్రీశైలం రిజర్వాయర్ నీటి మట్టాలు గరిష్టస్థాయికి చేరాయి. ఈ సీజన్‌లో మూడోసారి శ్రీశైలం గేట్లు తెరుచుకున్నాయి.

ఏడు గేట్లను ఎత్తి 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఇటు నాగార్జున సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో డ్యాం 14 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. పులిచింతల ప్రాజెక్టు 8 గేట్లను ఎత్తివేశారు. ఇదిలా ఉంటే…మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజె్క్టులోకి భారీగా ఇన్ ఫ్లో కొనసాగుతోందని డీఈ జగదీష్ వెల్లడించారు. సెప్టెంబర్ 27వ తేదీ శుక్రవారం ఉదయం ఎగువ ప్రాంతాల నుంచి 30 వేల 271 క్యూసెక్కుల నీరు వచ్చిందన్నారు. సాయంత్రానికి 78 వేల 880 క్యూసెక్కులకు పెరిగిందన్నారు. 
Read More : టెక్కీ మరణం: ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన నేత అరెస్టు