ఏసీబీ పనితీరుపై సీఎం జగన్ ఆగ్రహం : సెలవుల్లేకుండా పనిచేయండి..3 నెలల్లో మార్పు రావాలి  

  • Published By: veegamteam ,Published On : January 2, 2020 / 09:12 AM IST
ఏసీబీ పనితీరుపై సీఎం జగన్ ఆగ్రహం : సెలవుల్లేకుండా పనిచేయండి..3 నెలల్లో మార్పు రావాలి  

Updated On : January 2, 2020 / 9:12 AM IST

అవినీతి నిరోధక శాఖ  (ఏసీబీ) పనితీరుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏసీబీ పనితీరుపై సమీక్ష జరిపిన సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..ఏసీబీ పనితీరు ఆశించిన రీతిలో కనిపించటంలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. ఏసీబీ అధికారులు చురుగ్గా, విధుల పట్ల అంకితభావంతో పనిచేయాలనీ..లంచం తీసుకోవాలంటే ఏ అధికారి అయినా ఏ ఉద్యోగి అయినా భయపడేలా ఏసీబీ పనిచేయలని సూచించారు. ఏసీబీ పేరు చెబితే ఎవరైనా సరే భయపడాలని ఈ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్న సిబ్బందికి అలసత్వం ఉండకూడదని సూచించారు. 

అవినీతి నిరోధానికి 14400 కాల్ సెంటర్ ఏర్పాటు చేయటం వెనుక మంచి ఉద్ధేశం ఉందనీ..ఈ కాల్ సెంటర ఏర్పాటు వల్ల మంచి ఫలితాలు కనిపించాలని అన్నారు.  ప్రజలెవ్వరూ అవినీతిబారిన పడకూడదనీ లంచాలు ఇచ్చే పరిస్థితి ఎక్కడా ఉండకూడదనీ దీనికి ఏసీబీ కృషి చేయాలన్నారు. లంచం తీసుకోవాలంటే ఎవ్వరైనా సరే భయపడేలా ఏబీసీ పనితీరు ఉండాలన్నారు. 
 
తహసీల్దార్ కార్యాలయాలు, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు, టౌన్‌ ప్లానింగ్‌ ఇలా ఏ ఆఫీసుల్లోనే కాదు ఎక్కడా కూడా అవినీతి కనిపించకూడదు. లంచం తీసుకోవాలంటే భయపడే పరిస్థితి రావాలి. సెలవులు లేకుండా పని చేయండి. మూడు నెలల్లోగా మార్పు కనిపించాలి. ఏసీబీకి  కావాల్సినంత సిబ్బందిని తీసుకోండి. ఎటువంటి సదుపాయాలు కావాలన్నా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మరో నెల రోజుల్లో సమీక్ష చేస్తాం. అప్పటికి మార్పు కనిపించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.