ఏపీలో కొత్తగా 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 405 కి చేరుకుంది. ఏప్రిల్ 10 శుక్రవారం రాత్రి 9 నుండి శనివారం సాయంత్రం 6 వరకు నమూనాలను సేకరించి పరీక్షించిన వాటిలో కొత్తగా 24 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో గుంటూరులో 17, కర్నూల్ 5, ప్రకాశం,కడప జిల్లాల్లో ఒక్కొక్క కేసు వచ్చాయి.
ఇప్పటి వరకు కర్నూల్ జిల్లా లో అత్యధికంగా 82 పాజిటీవ్ కేసులు నమోదు కాగా… గుంటూరులో 75 నమోదు అయ్యాయి. ఏపీలో ఇప్పటివరకు కరోనా సోకి 6 గురు మృతి చెందారు.( అనంతపురం 2,కృష్ణ2, గుంటూరు 1, కర్నూల్ 1)…కరోనా పాజిటివ్ నుండి కోలుకుని 11 మంది డిశ్చార్జ్ కాగా…ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 388 మందికి చికిత్స పొందుతున్నారు.