ఏపీలో మద్యం ప్రియులకు షాక్ : సమయం కుదించారు

ఏపీలో మద్యం ప్రియులకు షాక్. సమయాన్ని కుదిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త పాలసీ ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది జగన్ ప్రభుత్వం. అక్టోబర్ 01వ తేదీ నుంచి ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మద్యం అమ్మకాలు జరపాలని సెప్టెంబర్ 30వ తేదీ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. బీర్లు, లిక్కర్ అమ్మకాల పరిమితంగానే అమ్మకాలు చేయనుంది. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మద్యం విక్రయాలు జరుగనున్నాయి.
ఒక్కో దుకాణంలో ఒక సూపర్ వైజర్, ముగ్గురు సేల్స్ మెన్స్ ఉండనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల 500 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. ఎక్కడైనా నిబంధనలు అతిక్రమించినా..బెల్టు షాపులు నిర్వహించినా..ప్రభుత్వం కొరఢా ఝులిపించనుంది. ఒక వ్యక్తి దగ్గుర మూడు బాటిళ్లు మాత్రమే ఉండాలని..అంతకంటే ఎక్కువ ఉంటే…కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరించిన సంగతి తెలిసిందే.
తెల్లారితే మద్యం పాలసీ అమల్లోకి వస్తుండడంతో ఆయా దుకాణ దారులు తమవద్దనున్న స్టాక్‌ను తక్కువ ధరకే విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మందుబాబులు బారులు తీరుతున్నట్లు టాక్. రాష్ట్రంలో దశల వారీగా సంపూర్ణమైన మద్య నిషేధం చేస్తామని ఎన్నికల సందర్భంగా వైసీపీ హామీనిచ్చిన సంగతి తెలిసిందే. అందుకనుగుణంగా అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ దీనిపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామాలు, పట్టణాలు ఇబ్బడిముబ్బడిగా ఉన్న బెల్టుషాపులపై కొరఢా ఝులిపించారు. వీటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.