అన్నవరం దేవస్థానానికి ISO గుర్తింపు

  • Published By: madhu ,Published On : April 22, 2019 / 06:47 AM IST
అన్నవరం దేవస్థానానికి ISO గుర్తింపు

Updated On : April 22, 2019 / 6:47 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో అన్నవరం టెంపుల్ ఒకటి. తూర్పుగోదావరి జిల్లాలో ఈ దేవాలయం ఉంది. దీనికి అంతర్జాతీయ ప్రమాణా సంస్థ ISO గుర్తింపు లభించింది. సత్యదేవుడి ప్రసాదంతో పాటు, ఆలయంలో అందుతున్న సేవలకు గాను 2 విభాగాల్లో ఈ గుర్తింపు లభించింది. HYM ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ప్రైవేటు లిమిటెడ్ ఎండీ శివయ్య ధృవీకరణపత్రాలను దేవస్థానం ఛైర్మన్ ఐ.వి. రోహిత్, ఈవో ఎం.వి.సురేష్ బాబు, ధర్మకర్తల మండలి సభ్యులకు ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం అందించారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా సత్యదేవుని గోధుమ నూకల ప్రసాదానికి ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల విభాగంలో ‘ISO 2200 : 2005 గుర్తింపు దక్కింది. ఆలయంలో అందుతున్న సేవలు, పని తీరు, స్వచ్చతా ప్రమాణాలకు ISO 9001 : 2015 గుర్తింపు వచ్చింది.