బాహుబలి కంటే పెద్ద కుట్ర ఇది : డేటా లీక్ పై చంద్రబాబు

  • Published By: madhu ,Published On : March 9, 2019 / 09:52 AM IST
బాహుబలి కంటే పెద్ద కుట్ర ఇది : డేటా లీక్ పై చంద్రబాబు

ఐటీ గ్రిడ్ డేటా చోరీలో మహా కుట్ర దాగి ఉందని..బాహుబలిలో కూడా అంత కుట్ర లేదని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కుట్ర ఎలా చేశారో అందుకు సంబంధించిన సాక్ష్యాలను ప్రవేశ పెడుతున్నట్లు మార్చి 09వ తేదీ మధ్యాహ్నం మీడియాకు వివరించారు. డేటా తస్కరణ కుట్ర స్కెచ్ ఢిల్లీలో జరిగిందని..అనంతరం హైదరాబాద్‌లో దాడులు..చేశారని తెలిపారు. పక్కా స్కెచ్ ప్రకారం ఇదంతా జరిగిందన్నారు. ఇక్కడ కంప్లయింట్ చేసిందో ఎవరో చెప్పలేదని..ఫిర్యాదు లేకుండానే కేసులు నమోదు చేశారని బాబు వెల్లడించారు. 
Read Also : హేమాహేమీలు : ఆంధ్ర ఎన్నికల స్థాయిలో.. మా ఎలక్షన్స్

డేటాను దొంగిలించి టీడీపీని నిర్వీర్యం చేయాలని వ్యవస్థలను యదేచ్చగా వాడుతూ భ్రష్టు పట్టిస్తున్నారని పేర్కొన్నారు. సాక్ష్యాలను ప్రజల ముందట పెడుతున్నట్లు వ్యాఖ్యానించారు. రాష్ట్ర, దేశ ప్రజలు ఆలోచించాలని, దుర్మార్గమైన పనులకు శ్రీకారం చుట్టారంటూ మండిపడ్డారు. ఇంత దారుణంగా కుట్రలు పన్నుతారని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఏ 1 ప్రతిపక్ష నేత జగన్, ఏ 2 విజయసాయిరెడ్డిలకు పొరుగు రాష్ట్రం తెలంగాణ పాలకులు సహకరించారని ఆయన అన్నారు. ఒక విధంగా పటేల్ వ్యవస్థను తీసుకొచ్చి దాడి చేసే పరిస్థితికి వచ్చారన్నారు. తొలుత ఎన్నికల కమిషన్‌కు మెమారండం సమర్పించిన అనంతరం హైదరాబాద్‌లో యాక్షన్ జరిగిందన్నారు. పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇవ్వరు..అనంతరం దాడులు చేసిన అనంతరం ఫిర్యాదులు తీసుకుంటారని పేర్కొన్నారు. 

19-02-2019 చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఫిర్యాదు చేశారు..22-02-2019 రోజున ఆ ఫిర్యాదుకు మెరుగులు దిద్ది హైదరాబాద్‌లో ఎలక్షన్ కమిషన్‌కి ఫిర్యాదు ఇచ్చారన్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే ఫిర్యాదుతో పాటు యాక్షన్ ప్లాన్ కూడా ఇచ్చేశారని బాబు తెలిపారు. ఫిబ్రవరి 23వ తేదీన యాక్షన్ స్టార్ట్ అయ్యిందన్న బాబు ఐటీ గ్రిడ్ కంపెనీపై దాడులు చేశారని చెప్పుకొచ్చారు. ఇది చట్ట విరుద్ధమని ఆయన అన్నారు. 

ఏమి చెప్పకుండా డేటాను దొంగిలించుకపోయారని..ఇలా చేస్తే ఐటీ కంపెనీలు పెట్టడానికి ముందుకొస్తారా ? అని ప్రశ్నించారు. సేవామిత్ర యాప్ ప్రచారం, సభ్యత్వ నమోదు, కార్యకర్తల సంక్షేమ నిధి..ఇతరత్రా సమాచారం దొంగిలించారు. అక్కడున్న ఉద్యోగులను విచారించి బెదిరించారని బాబు ఆరోపించారు. ఫిబ్రవరి 26వ తేదీన ఓ పత్రికలో ఒక వార్త వచ్చిందని, ఎవరు కంప్లయింట్ ఇచ్చారో ఎవరూ చెప్పలేదన్నారు. 02-03-2019 అర్ధరాత్రి ఫిర్యాదు తీసుకున్నారని చెప్పిన బాబు ఏపీకి సంబంధించిన డేటా పోయిందంటే…తమకు సమాచారం అందించాలి కానీ అలా చేయలేదన్నారు. ఏపీపై కేసు పెట్టి ఐటీకి సంబంధించిన ఉద్యోగులను వేధించారన్నారు. 
Read Also : ‘మా’ ఎన్నికలు: రెండు ప్యానల్‌ల సభ్యులు వీళ్లే!

03-02-2019 హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే..ఉద్యోగులను కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించి.. తెల్లకాగితాలపై వీఆర్వో సంతకాలు ఎందుకు తీసుకున్నారని కోర్టు ప్రశ్నించిందన్నారు. ఫైనల్ హియరింగ్ అయిన తరువాత…ఎస్ఆర్ నగర్ పీఎస్‌లో కంప్లయింట్ చేశారని..అప్పుడు ఎందుకు అవసరం వచ్చింది ? బాబు ప్రశ్నించారు. 04-03-2019 సైబరాబాద్ పోలీసులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం…07-09-52019 స్టీఫెన్ రవీంద్ర ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. సోదాలు జరిగింది నిజం అని సజ్జనార్ చెప్పకుండా స్టీపెన్ ఎలా చెబుతాడని నిలదీశారు. 
Read Also : ఎన్నికల బరిలోకా ? ప్రచారానికా ? : బాబుతో కౌశల్