కేజ్రీవాల్ కు బాబు రూ.50 కోట్లిచారట: ఇదో లెక్కా అంటున్న వైసీపీ

  • Published By: veegamteam ,Published On : March 31, 2019 / 05:55 AM IST
కేజ్రీవాల్ కు బాబు రూ.50 కోట్లిచారట: ఇదో లెక్కా అంటున్న వైసీపీ

Updated On : March 31, 2019 / 5:55 AM IST

ఏపీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు తరపున ప్రచారం చేసేందుకు పలువురు నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఫరూక్ అబ్దుల్లా..అరవింద్ కేజ్రీవాల్ ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ తరఫున ప్రచారం చేయడానికి వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు చంద్రబాబునాయుడు రూ. 50 కోట్లు గిఫ్ట్ గా ఇచ్చి పంపించారని ఢిల్లీకి చెందిన ఓ పత్రిక ప్రచురించిందని విజయసాయిరెడ్డి విమర్శలు సంధించారు. దానికి సంబంధించిన ఓ పేపర్ కట్టింగ్ ను విజయసాయి తన ట్విట్టర్ లో (పత్రిక పూర్తి పేరు కనిపించకుండా)పోస్ట్  చేశారు. 
Read Also : గెలిస్తే ఏం చేస్తానంటే : గాజువాక నియోజకవర్గ జనసేన మేనిఫెస్టో

ఏపీ ఎన్నికల యుద్ధంలో పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు  సంధించుకుంటున్న క్రమంలో విజయసాయి దీన్ని విమర్శనాస్త్రంగా వినియోగించుకున్నారు. టీడీపీని విమర్శించే విషయంలో ఏమాత్రం అవకాశం దొరికినా విడిచిపెట్టని విజయసాయి “రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ లకు వందల కోట్ల ఫండింగ్ ఎలా చేస్తున్నాడని ఢిల్లీలో మీడియా మిత్రులు అడిగారు.13 జిల్లాల చిన్న రాష్ట్రం దేశం మొత్తానికి ఎలక్షన్ నిధులివ్వడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మట్టి, రాయి, ఇసుక నుంచి కూడా బంగారం తీయగల నేర్పరికి అదొక లెక్కా?” అని ప్రశ్నించారు.
 

Read Also : రాహుల్ పీఎం కాగానే భార్యకు భరణం ఇస్తా : కోర్టులో భర్త వాదన