రాష్ట్రంలో 20 వేల వైఎస్సార్ జనతా బజార్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 వేల వైఎస్సార్ జనతా బజార్లు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులకు అందుబాటులో ఉండేలా గ్రామాలు పట్టణాల్లో ఉండేలా వీటిని ఏర్పాటుచేయాలని సూచించారు.వ్యవసాయ అనుబంధ రంగాల్లో కోల్డ్‌చైన్, ప్రాసెసింగ్ నెట్‌వర్క్‌ను పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో ఈ అంశంపై అదికారులతో సీఎం జగన్ సోమవారం చర్చించారు. రాష్ట్రంలోని 11 వేల గ్రామ సచివాలయాల సమీపంలోనే జనతా బజార్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సుమారు 22 వేల జనతా బజార్ల ఏర్పాటుతో అతి పెద్ద నెట్ వర్క్ ఏర్పడుతుందని ఆయన అన్నారు. రైతుల ఉత్పత్తుల కోసం శీతలీకరణ కేంద్రాలు, రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంచాలన్నారు. ఇందుకోసం ప్రతి గ్రామ సచివాలయం ఒక ట్రక్కను సమకూర్చుకోవాలన్నారు.
ప్రస్తుతం కరోనా వ్యాప్తి నిరోధంలో భాగంగా చేపట్టిన చర్యల్లో రైతు బజార్లను వికేంద్రీకరించి….నిత్యావసర వస్తువులను గడప గడపకుచేర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున మార్కెటింగ్ అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని ఈలోకేషన్లు కూడా గుర్తించి ఆమేరకు అక్కడ జనతా బజార్లు వచ్చేలా ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. (ఏపీలో ఎప్పుడైనా ఎన్నికలు…సిద్ధంగా ఉండాలన్న SEC కనగరాజ్)
లాభనష్టాలు లేని రీతిలో జనతా బజార్లను నిర్వహిస్తే ప్రజలకు మంచి ధరల్లో నిత్యావసర వస్తువులు లభిస్తాయని ఆయన అన్నారు. జనతా బజార్లలో రొయ్యలు చేపలు వంటి ఆక్వా ఉత్పత్తులు కూడా అమ్ముడు పోయేలా ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. రైతులకు గిట్టుబాటుధర ఇచ్చే ప్రక్రియలో ఈప్రయత్నం మేలుచేస్తుందని సీఎం అన్నారు.
ఇది సక్రమంగా చేయగలిగితే.. అటు రైతులకు, ఇటు వినియోగదారులకు మేలు జరుగుతుందని జగన్ అన్నారు. గ్రామాల స్వరూపాలు మారిపోతాయి అలాగే ప్రతి గ్రామంలోనూ కూడా గోడౌన్లు ఉండే దిశగా అడుగులు వేయాలి…గ్రామాల్లో గొప్ప మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్టు అవుతుంది.. ఈ ప్రాజెక్టును అధికారులు ఓనర్ షిప్ తీసుకుని సమిష్టిగా పనిచేసి విజయవంతం అయ్యేలా చూడాలి. వైయస్సార్ జనతాబజార్ల ప్రాజెక్టుకు ఒక ఐఏఎస్ అధికారిని నియమించమని ఆయన ఆదేశించారు.