రాజధానిపై జగన్ సంచలన నిర్ణయం
రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని నిర్మాణ బాధ్యతల నుంచి సింగపూర్ కన్సార్టియాన్ని తప్పించింది.

రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని నిర్మాణ బాధ్యతల నుంచి సింగపూర్ కన్సార్టియాన్ని తప్పించింది.
రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని నిర్మాణ బాధ్యతల నుంచి సింగపూర్ కన్సార్టియాన్ని తప్పించింది. అమరావతి స్టార్ట్-అప్ ఏరియా ప్రాజెక్టుపై బాబు హయాంలో సింగపూర్ కన్సార్టియంతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించింది. అమరావతిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి కోసం సింగపూర్ కన్సార్షియంతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించింది.
ఐదు నెలల నుంచి ఎక్కడివక్కడ పనులు నిలిచిపోయాయి. పలుమార్లు సింగపూర్ సర్కార్ కూడా స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సిద్ధంగా ఉన్నామని.. ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ప్రకటనలు కూడా చేసింది. అయితే… స్టార్టప్ ఏరియా అభివృద్ధి చేస్తే.. ఏపీ కన్నా.. సింగపూర్ సంస్థలకే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని.. ఏపీ సర్కార్ నిర్ణయానికి వచ్చింది. దీంతో… ఒప్పందాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
చంద్రబాబు హయాంలో సింగపూర్ కన్సార్షియంతో స్టార్టప్ ఏరియా అభివృద్ధి కోసం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కృష్ణానదీ తీరాన, సీడ్ యాక్సెస్ రోడ్‌కు పక్కన, గవర్నమెంట్ కాంప్లెక్స్‌కు సమీపంలో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి గత ప్రభుత్వం ప్రతిపాదించింది. 1691ఎకరాల్లో అభివృద్ధి చేయదలచిన ఈ స్టార్టప్ ఏరియాను 3 దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది. తొలిదశగా మూడేళ్లలో 656ఎకరాలు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో అభివృద్ధి పరచి, 8.07లక్షల చదరపు అడుగుల బిల్డింగ్ స్పేస్ రూపొందించాలి. అందులో తమ శాఖలు- కార్యాలయాలు స్థాపించేలా సుప్రసిద్ధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించాలని అప్పటి ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. దీనికి సంబంధించి సింగపూర్ కన్సార్టియంతో 15మే 2017న ఒప్పందం కుదుర్చుకుంది.
అయితే… రైతుల నుంచి గత ప్రభుత్వం 30 వేల పైచిలుకు ఎకరాల భూమిని తీసుకుంది. సింగపూర్ కన్సార్షియంతో రాజధాని నిర్మాణం కోసం ఒప్పందం చేసుకుంది. ప్రపంచస్థాయిలో రాజధాని నిర్మిస్తామని చెప్పి.. కాలం వెళ్లదీసిందని వైసీపీ ఆరోపించింది. అధికారంలోకి వచ్చాక.. రాజధాని నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై దృష్టిపెట్టింది. అమరావతి స్టార్ట్-అప్ ఏరియా డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ గత టిడిపి ప్రభుత్వం ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిన రియల్ ఎస్టేట్ వెంచర్‌గా వైసీపీ భావించింది. ఇక ప్రతిపాదిత 1691 ఎకరాల్లో 170 ఎకరాలు నది ఒడ్డున ఉండటంతో… ఈ స్థలం పర్యావరణ-చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకుంది. అక్కడ ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు నిర్వహించేందుకు అవకాశం లేదు.
ఈ పరిస్థితుల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో ప్రత్యామ్నాయ భూమిని కేటాయించాలని సింగపూర్ కోరింది. దీని కోసం, కోర్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్‌ను మార్చేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కొన్ని ప్రైవేట్ సంస్థలకు భూమిని కేటాయించినందున ఆ ప్రయత్నం ఫలించలేదు. అందువల్ల స్టార్ట్-అప్ ప్రాజెక్ట్ ప్రారంభం కాలేదు. ఇప్పుడు ఏకంగా ఒప్పదమే రద్దైంది.