డేటా డిష్యూం డిష్యూం : ఏపీలో SIT ఏర్పాటు

  • Published By: madhu ,Published On : March 7, 2019 / 03:36 PM IST
డేటా డిష్యూం డిష్యూం : ఏపీలో SIT ఏర్పాటు

డేటా చోరీ కేసులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా సిట్ నియమించింది. గత కొద్ది రోజులుగా సేవామిత్రలో ప్రజలకు సంబంధించిన డేటాను ఐటీ గ్రిడ్ కంపెనీ నిక్షిప్తం చేసిందనే ఫిర్యాదుతో తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో సంచలన విషయాలు వెల్లడవుతుండడంతో ప్రభుత్వం SIT ఏర్పాటు చేసింది. తమ డేటాకు సంబంధించిన విషయంలో టి.సర్కార్ జోక్యం ఎందుకు అని టిడిపి ప్రశ్నిస్తోంది. ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో 9 మంది విచారణ చేపడుతున్నారు. 

తాజాగా మార్చి 07వ తేదీ గురువారం ఏపీ సర్కార్ కూడా SIT ఏర్పాటు చేసింది. ఇక్కడ కూడా 9 మంది సభ్యులు విచారణ చేపట్టనున్నారని ప్రభుత్వం పేర్కొంటూ జీవో జారీ చేసింది. రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యం నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. సిట్ బృందంలో సీనియర్ ఐపీఎస్‌లు, సాంకేతిక నిపుణులున్నారు. సభ్యులుగా ఐజీ హరికుమార్, ఎస్పీలు రామకృష్ణ, రాజశేఖర్ బాబు, మేరి ప్రశాంతి, ఏఎస్పీ రామ్మోహన్ రావు, డీఎస్పీ పి. అనీల్ కుమార్, సీఐ ఎన్. నాగమల్లేశ్వరరావు, ఎస్ఐ రహీముల్లాలున్నారు. ఫామ్ – 7 దరఖాస్తులపై నమోదైన కేసుల విచారణకు ఐజీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మరో SITను ఏపీ ప్రభుత్వం నియమించింది.