అతడు-ఆమె- ఓ రైలు: నమ్మించి పెళ్లి చేసుకుని తక్కువ కులందానివని పొమ్మన్నాడు

అతడు-ఆమె- ఓ రైలు ప్రయాణం. ఇది సినిమా కాదు నిజం జీవితంలో జరిగింది. అతను రైలులో పరిచమయ్యాడు. ప్రేమ అన్నాడు. ఆమెను నమ్మించాడు. ఆమె నమ్మేసింది. పెళ్లి చేసుకోకుండానే గర్భవతిని చేశాడు. ఆ విషయం తెలుసుకని పెళ్లి కూడా చేసుకున్నాడు. తరువాతే మొదలైంది అసలు కథ…
వివరాల్లోకి వెళితే..విజయనగరం వెళ్లే రైలులో మొదలైంది పరిచయం + ప్రేమ + పెళ్లి = మోసం కథ. టెక్కలి మండలం నౌపడ ఆర్‌ఎస్ గ్రామానికి చెందిన ముడాదాన ప్రమీల కోచింగ్ కోసం ఒక రోజు రైలులో విజయనగరం వెళ్తోంది. అదే రైలులో వజ్రపుకొత్తూరు మండలం కొమరల్తాడ గ్రామానికి చెందిన కొంకి వెంకటేష్ కూడా ప్రయాణం చేస్తున్నాడు. ఆ ఇద్దరికీ రైలు ప్రయాణం పరిచయం చేసింది. వెంకటేష్ అప్పటికే ఆర్‌ఆర్‌బీ కోచింగ్ తీసుకుంటున్నాడు. అలా రైలు ప్రయాణంలో ఎన్నో ముచ్చట్లు చెప్పుకున్నారు. ముచ్చట్ల మధ్య వెంకటేశ్ దిగాల్సిన స్టేషన్ వచ్చేసింది. ఇద్దరికీ ఎంతో బాదేసింది. ఈ ప్రయాణం ఇంకాసేపు ఉంటే ఎంత బాగుండు అనుకున్నారు.
కానీ కుదరదు కదా..ఎవరి స్టేషన్ వస్తే వాళ్లు దిగాల్సిందే రైలు ప్రయాణంలో.అలాగే వెంకటేశ్ దిగి వెళ్లిపోయాడు. అతను వెళ్లిపోయాక ప్రమీలకు రైలు ప్రయాణం బోర్ కొట్టింది. అలా అప్పటి వరకూ వెంకటేశ్ కూర్చున్న సీటు వంకే చూసుకుంటూ వెంకటేష్ తనతో చెప్పిన ముచ్చట్లు గుర్తు చేసుకుంటూ ఉండిపోయిన ఆమెకు వెంకటేష్ ఆర్‌ఆర్‌బీ కోచింగ్ కు సంబంధించి ఐడీ కార్డు కనిపించింది. అయ్యో..అతను కార్డ్ మరచిపోయాడే అనుకుంది. దాన్ని తీసుకుని తన స్టేషన్ వచ్చాక దిగిపోయింది.
తరువాత ఆ కార్డు అతడికి అవసరం ఉంటుంది కదా..ఇబ్బంది పడతాడేమోనని గుర్తించి దానిపై ఉన్న నంబర్‌కు ఫోన్ చేసింది. దానికి వెంకటేష్ నేను కార్డు మరచిపోలేదు కావాలనే వదిలి వెళ్లానని చెప్పాడు. ఈ నెంబర్ కు నువ్వు కాల్ చేయాలనే కార్డు వదిలేశానని చెప్పాడు. తరువా నిన్ను ప్రేమిస్తున్నానని..రాజమండ్రిలో ఉన్నానని ఐడీ కార్డు కోసం నీ దగ్గకు వస్తానని చెప్పాడు. అలా రోజు ఫోన్ చేసేవాడు. ఇద్దరూ గంటల తరబడి మాట్లాడుకునేవారు.
అలా వారి మధ్య రైలు ప్రయాణం ఫోన్ లో ముచ్చట్ల వరకూ వెళ్లీ..వెళ్లీ..అదికాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో నెల రోజుల తర్వాత ప్రమీల రాజమండ్రి బీఈడీ కోచింగ్‌కు వెళ్లింది. ఇంకేముందీ..చాలా రోజుల తరువాత కలుసుకున్నారు కదూ..ఇద్దరు చక్కగా తిరిగారు. శారీకరంగా కలిసారు. ఫలితంగా ప్రమీల గర్భం వచ్చింది.భయమేసి..వెంకటేష్ చెప్పింది. ఏం భయపడొద్దు ఇద్దరం పెళ్లి చేసుకుందామంటూ తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం చర్చిలో ఫిబ్రవరి 4న పెళ్లి చేసుకున్నారు. తరువాత కొత్తకాపురం..మంచిగా 15 రోజులపాటు కాపురంలో స్వర్గం చూపించాడు ప్రమీలకు వెంకటేష్.
తరువాత మానాన్న దగ్గరకు వెళ్లి నీ గురించి చెప్పి తీసుకెళతానని చెప్పాడు. మళ్లీ నమ్మించి పిచ్చి ప్రమీల. కానీ అక్కడ నుంచి వెంకటేష్ రాలేదు సరికదా..ఫోన్ చేస్తూ అబార్షన్ చేయించుకోమని పదే పదే చెప్పేవాడు. ఒత్తిడి చేసేవాడు. దానికామె తీయించుకోనని చెప్పింది. అయితే నువ్వు నాకు అక్కర్లేదని చెప్పేశాడు. నువ్వు తక్కువ కులందానివి నువ్వు నాకు అక్కర్లేదని..నానా బూతులు తిట్టాడు.
తాను ఎంతో ప్రేమించినవాడు అలా ఎదురు దాడికి దిగేసరికి మోసపోయానని అప్పటికీ గానీ కళ్లు తెరుచుకోలేని పిచ్చి ప్రమీల తన తల్లిదండ్రులతో కలసి టెక్కలి పోలీసులకు వెంకటేశ్ నన్ను నమ్మించి మోసం చేశాడు నాకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది. తాము పెళ్లి చేసుకున్న మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా పోలీసులకు చూపించింది. అప్పటికే ప్రమీల ఐదు నెలల గర్భిణి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరి ప్రమీలకు న్యాయం జరుగుతుందా? ఎంతో మంది దగాపడిన ఆడబిడ్డల్లా ప్రమీల మిగిలిపోతుందా? లేదా ఆడబిడ్డకు అన్యాయం చేసినవాడికి తగిన బుద్ది చెప్పి పోలీసులు ప్రమీలకు న్యాయం చేస్తారోలేదో వేచి చూడాలి.
See Also | భారత్ “దూరంగా జారిపోతుంది”…మన్మోహన్ సంచలన వ్యాఖ్యలు