బై..బై బాబు : జగన్ను సీఎం చేయండి – షర్మిల

వేలాది ఎకరాలను టీడీపీ నేతలు స్వాహా చేశారని ఆరోపించారు.

  • Published By: madhu ,Published On : April 5, 2019 / 11:47 AM IST
బై..బై బాబు : జగన్ను సీఎం చేయండి – షర్మిల

Updated On : April 5, 2019 / 11:47 AM IST

వేలాది ఎకరాలను టీడీపీ నేతలు స్వాహా చేశారని ఆరోపించారు.

వేలాది ఎకరాలను టీడీపీ నేతలు స్వాహా చేశారని ఆరోపించారు. ఇస్తామన్న హామీలు ఐదు సంవత్సరాల్లో బాబు నెరవేర్చలేదని, ఇంటికి వచ్చిన తెలుగు తమ్ముళ్లను నిలదీయాలని పిలుపునిచ్చారు. అవినీతి పాలన పోవాలంటే జగన్ రావాలని..రాజన్న రాజ్యం రావాలంటే జగన్ సీఎం కావాలన్నారు. 
Read Also : అగ్రిగోల్డ్‌పై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు : జగన్‌కు పవన్ క్వశ్చన్

ప్రతి రైతు తలెత్తుకుని రాజులా బతకాలని..అన్నారు. ఏప్రిల్ 05వ తేదీ శుక్రవారం ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో ఆమె ప్రసంగిస్తూ…పెట్టుబడి సాయం కింద అతనికి 12 వేల 500 ఇస్తామని, గిట్టుబాటు ధర కోసం రూ. 3500 కోట్లు, రైతులకు నష్టాలు ఎదురైతే 4వేల కోట్లతో నిధులు ఏర్పాటు చేస్తామన్నారు.

విద్యార్థులు చదువుకోవడానికి వైసీపీ కృషి చేస్తుందని హామీనిచ్చారు షర్మిల. బాబు వస్తే జాబు వస్తుందని అని అన్నారని..కానీ కరవు వచ్చిందని ఎద్దేవా చేశారు. ప్రజా తీర్పు కావాలి..బై..బై బాబు అనే నినాదాలు మారుమోగాయి. తమ పార్టీకి చెందిన ఎంపీ, అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించాలని షర్మిల కోరారు. 
Read Also : అవినీతి కోట తలుపులు బద్దలు కొడతా : పవన్