మరోదారుణం : తొమ్మిది నెలల గర్భిణీపై కేబుల్ టీవీ వర్కర్ అత్యాచారం

తొమ్మిది నెలల గర్భిణీపై కామంతో కళ్లు మూసుకుపోయిన కేబుల్ టీవీ వర్కర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఒంటరిగా ఉంటన్న ఆమెను బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అత్యాచారం చేసిన ఘటనను సదరు వ్యక్తి తన సెల్ ఫోన్ లో రికార్డ్ చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కరీంనగర్ జిల్లా బొమ్మకల్ లో డిసెంబర్ 9న చోటుచేసుకుంది. దీంతో ఈ విషయం బైటకు తెలిస్తే పరువు పోతుందనే భయంతో పాపం ఆ గర్భిణి మౌనంగా ఉండిపోయింది.
బొమ్మకల్ లో ఓ కుటుంబం కొన్నేళ్లు నివాసముంటోంది. భర్త సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. అతడి భార్య తొమ్మిది నెలల గర్భంతో ఉంది. ఈ క్రమంలో భర్త ఉద్యోగానికి వెళ్లగా ఇంట్లో ఆమె ఒంటరిగా ఉంది. దీంతో ఆమెపై కన్నేసిన కేబుల్ టీవీ వర్కర్ రామకృష్ణ ఆమెపాలిట మృగంలా మారాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అందంతా సెల్ ఫోన్ లో రికార్డ్ చేశాడు. ఈ విషయం బైటకు చెబితే చంపేస్తాననీ..ఈ వీడియో బైటపెడతానని బెదిరించాడు. దీంతో ఆమె భయపడిపోయింది.
డ్యూటీ ముగించుకుని వచ్చిన భర్త ఆమె ఆందోళనగా ఉండటం చూసి ఏం జరిగిందని అడిగాడు. దీంతో భోరను ఏడుస్తూ తనపై జరిగిన పాశవిక దాడి గురించి చెప్పింది. కానీ కేబుల్ టీవీ వర్కర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాడు. కానీ ఈ విషయం బైటకు తెలిస్తే కుటుంబం పరువు పోతుందనే భయంతో కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండిపోయారు.
కానీ ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచార ఘటనను రామకృష్ణ సెల్ ఫోన్ లో రికార్డు చేసినట్లుగా బాధితురాలు చెప్పింది. దీంతో పోలీసులు రామకృష్ణను అదుపులోకి తీసుకుని సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిపై అత్యాచారంతో పాటు అట్రాసిటీ కేసు నమోదు చేసి..దర్యాప్తు చేపట్టారు. అనంతరం వైద్య పరీక్షల కోసం బాధితురాలిని హాస్పిటల్ కు తరలించారు.
కాగా..రోజు రోజుకూ పెరుగుతున్న అఘాయిత్యాలతో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఇంట్లో ఉన్నా రక్షణ లేని పరిస్థితి. అఘాయిత్యాలకు పాల్పడిన దుర్మార్గులపై ఫిర్యాదు చేసిన కేసుల విచారణల్లో తీవ్రమైన జాప్యం జరగుతోంది. దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన నిర్బయ ఘటన జరిగి..విచరణ కూడా పూర్తై….నిందుతులు దోషులుగా తేలినా వారికి ఇప్పటి వరకూ శిక్ష అమలు కాలేదు. మరోపక్క మరో సంచలనం కలిగించిన దిశ ఘటన..ఇలా ఆడవారిపై అఘాయిత్యాలు..దారుణాలు జరగుతునే ఉన్నాయి. వీటికి ఫుల్ స్టాప్ పడాలంటే చట్టాలు మరింత కఠినతరమవ్వాలి. దోషులకు సత్వరమే శిక్షలు పడాలి..అవి అమలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.