విశాఖప్నటంలో రూ.కోటి విలువైన గంజాయి పట్టివేత

  • Published By: veegamteam ,Published On : September 9, 2019 / 05:37 AM IST
విశాఖప్నటంలో రూ.కోటి విలువైన గంజాయి పట్టివేత

Updated On : September 9, 2019 / 5:37 AM IST

విశాఖపట్నంలో భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది. మాదకద్రవ్యాల తరలింపులపై పోలీసులు శాఖ ఎంతగా నిఘా పెట్టినా..స్మగ్లర్స్ మాత్రం పలు దారుల్లో మత్తు పదార్థాలను తరలిస్తునే ఉన్నారు. ఈ క్రమంలో విశాఖపట్నం జిల్లాలోని నర్సిపట్నం సిటీలో ఓ ట్రక్కులో తరలిస్తున్నన రూ .1 కోట్ల విలువైన గంజాయిని సోమవారం (సెప్టెంబర్ 9)న  ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ పోలీసులు పట్టుకున్నారు. అనంతరం దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ట్రక్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. 

ఒడిశా రాష్ట్రం పేరుతో ఈ ట్రక్  రిజిస్టర్డ్ అయి ఉన్న ఈ ట్రక్కులో గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నామని..ట్రక్  డ్రైవర్‌ను అరెస్టు చేసామని ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ సతీష్ తెలిపారు. దీన్ని విశాఖ నుంచి ఒడిశాకు రవాణా చేస్తున్నారనే పక్కా సమాచారంతో తనఖీలు నిర్వహించగా 815 కిలోల గంజాయి పట్టుబడిందని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.