సీఎం జగన్ కు సీబీఐ కోర్టు షాక్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ కు సీబీఐ కోర్టు షాక్ ఇచ్చింది. ఆస్తుల కేసు వ్యవహారంలో జగన్ కు వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ కు సీబీఐ కోర్టు షాక్ ఇచ్చింది. ఆస్తుల కేసు వ్యవహారంలో జగన్ కు వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ కు సీబీఐ కోర్టు షాక్ ఇచ్చింది. ఆస్తుల కేసు వ్యవహారంలో జగన్ కు వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది. 2020, జనవరి 10న విచారణకు జగన్ హాజరుకావాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. వచ్చే శుక్రవారం నుంచి సీబీఐ కోర్టు విచారణకు జగన్, విజయసాయిరెడ్డి హాజరుకావాలని సీబీఐ కోర్టు ఆదేశించింది.
సీఎం అయిన తరువాత అధికారిక విధుల్లో ఉంటున్న జగన్ తన లాయర్ ద్వారా పిటిషన్ దాఖలు చేయిస్తూ విచారణకు న్యాయవాదిని పంపిస్తున్నారు. అయితే దీని పైన సీబీఐ కోర్టు కీలక సూచనలు చేసింది. 2020 జనవరి 10వ తేదీన ఖచ్చితంగా సీఎం జగన్ విచారణ నిమిత్తం కోర్టుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. ఎన్నికల్లో గెలిచి సీఎం అయిన తర్వాత కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సీబీఐ కోర్టు జగన్ అభ్యర్థించాడు.
దీనికి సంబంధించి హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు. దీని పైన ఒక వైపు వాదప్రతివాదనలు కొనసాగుతున్నాయి. ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టులో జగన్ లాయర్ ఆబ్సెంట్ పిటిషన్ వేస్తున్నారు. అయితే ఈ సారి జగన్ లాయర్ సీబీఐ కోర్టు కొన్ని ఆదేశాలిచ్చింది. ఈనెల పదో తేదీన తప్పనిసరిగా జగన్ తో పాటుగా విజయసాయిరెడ్డి హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది.
తనను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని సీఎం అయిన తరువాత జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో వాదనల తరువాత సీబీఐ కోర్టు జగన్ పిటిషన్ ను కొట్టివేసింది. దీని పైన జగన్ హైకోర్టుకు వెళ్లారు. అయితే సీఎం అయ్యాక తనకున్న అధికారిక కార్యక్రమాల కారణంగా హాజరు కాలేకపోతున్నానంటూ జగన్ ప్రతి శుక్రవారం గైర్హాజరు పిటిషన్ దాఖలు చేస్తున్నారు.
ప్రతి వారం ఆమోదిస్తున్న కోర్టు ఈ సారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటివరకు 10 సార్లు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇచ్చామని చెప్పింది. చాలా మంది ప్రజా ప్రతినిధుల పైన కేసులు ఉన్నాయని.. అందరూ చట్టానికి లోబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. జగన్ తో పాటుగా విజయ సాయి రెడ్డి సైతం హాజరు కావాలని సీబీఐ కోర్టు ఆదేశించింది.