నాలుగు జిల్లాల్లో చంద్రబాబు ప్రచారం

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణాలో పర్యటించి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గోంటారు. ఉదయం 10.30 గంటలకు నెల్లూరు చేరుకొనే చంద్రబాబు నెల్లూరులోని ఎస్‌వీజీఎస్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగసభ లో పాల్గోంటారు. అనంతరం పార్టీ కి చెందిన ముఖ్యనాయకులు, బూత్ కన్వీనర్లతో సమావేశం అవుతారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అక్కడ్నించి బయలుదేరి ప్రకాశం జిల్లా ఒంగోలు చేరుకుంటారు. అక్కడ మినీస్టేడియంలో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు.
Read Also : బీజేపీ ఫస్ట్‌లిస్ట్: 123 మంది అభ్యర్థులు వీళ్లే
సాయంత్రం 5 గంటలకు గుంటూరు చేరుకొని, ఎల్‌ఈఎం స్కూల్ మైదానంలో జరిగే బహిరంగసభలో సీఎం ప్రసంగిస్తారు. గుంటూరు సభ అనంతరం విజయవాడ సమీపంలోని కానూరు సిద్దార్థ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడతారు. అనంతరం స్దానిక టిడిపి ముఖ్యనాయకులు, బూత్ కన్వీనర్లతో చంద్రబాబు సమావేశం అవుతారు.
Read Also : సెంటిమెంట్: ముహూర్తాలు చూస్తున్న అభ్యర్దులు