బాబు బిరుదు : ప్ర‌శాంత్ కిషోర్ బీహార్ డెకాయిట్

  • Published By: madhu ,Published On : March 18, 2019 / 11:11 AM IST
బాబు బిరుదు : ప్ర‌శాంత్ కిషోర్ బీహార్ డెకాయిట్

వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బీహార్ డెకాయిట్ అంటూ ఏపీ సీఎం బాబు అభివర్ణించారు. ఎన్నికల ప్రచారంలో వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు బాబు. పక్క రాష్ట్రమైన తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కూడా వ్యాఖ్యలు చేస్తున్న బాబు ఓటర్లను ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సందర్భంగా బాబు ప్రచారంలో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. మార్చి 18వ తేదీ సోమవారం గుంటూరుకు జిల్లాకు వచ్చిన బాబు ఎన్నికల ప్రచార సభలో పాల్గొని స్పీచ్ ఇచ్చారు. 
Read Also : అరుదైన వ్యాధి అంట : ముషార్రఫ్ ఆరోగ్యం విషమం

కేసీఆర్‌పై : 
తన దగ్గర పనిచేసిన కేసీఆర్‌కే అంత ఉంటే నాకెంత ఉండాలి..ఫెడరల్ ఫ్రంట్‌లో ఉండేది టీఆర్ఎస్, వైసీపీలు మాత్రమేనని ముందే బాబు చెప్పేశారు. ఏపీలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఏం పని ? అంటూ ప్రశ్నించారు. అడుగడుగునా కేసీఆర్ అభివృద్ధికి అడ్డు పడుతున్నారని, రాష్ట్రానికి రావాల్సిన ఆస్తులను పంచలేదని ఆరోపించారు. ఏపీలో ప్రాజెక్టులను అడ్డుకుని నిలిపివేయాలని చూస్తున్నారంటూ అన్న బాబు కేసీఆర్‌కు రాజకీయ జీవితం ఇచ్చింది తానేనంటూ కామెంట్ చేశారు. తన దగ్గర పనిచేసిన వ్యక్తే తనకు పాఠాలు నేర్పుతున్నారని, తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్..ఏపీ ప్రజలను ఎలా విమర్శించారు. ? తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎలా లాక్కొన్నారు ? అని ప్రశ్నించారు. ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందారని విమర్శించారు.
జగన్‌పై : 
ఫారం -7తో తెలియకుండానే ఓట్లు తొలగిస్తున్నారని పరోక్షంగా వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వంపై మోడీ కక్ష కట్టారని, ఢిల్లీలో కరెంటు.. హైదరాబాద్‌లో స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుందంటూ ఎద్దేవా చేశారు. ఏమైనా ఈ ఎన్నికల్లో సైకిల్ స్పీడుకు ఫ్యాన్ పటాపంచలవుతుందని జోస్యం చెప్పారు.  కేసీఆర్‌కు జగన్ వంత పాడుతాడు అంటూ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్‌కు సంబంధించిందని అన్న బాబు..నమ్మక ద్రోహులను ఒంగోలు గిత్తల్లా కుమ్మేయ్యాలని పిలుపునిచ్చారు.
Read Also : సెంటిమెంట్: ముహూర్తాలు చూస్తున్న అభ్యర్దులు