జనవరి 08న బాబు హస్తినకు పయనం

  • Published By: madhu ,Published On : January 7, 2019 / 02:34 AM IST
జనవరి 08న బాబు హస్తినకు పయనం

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హస్తినకు వెళ్లనున్నారు. పలువురు ప్రతిపక్ష నేతలను ఆయన కలువనున్నారు. రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఎంపీలతోనూ ఆయన సమావేశం కానున్నారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై వారితో మాట్లాడనున్నారు. 
కర్నూలులో జన్మభూమి – మా ఊరు…
జనవరి 08వ తేదీన కర్నూలో జరిగే జన్మభూమి – మా ఊరు కార్యక్రమంలో బాబు పాల్గొని..మధ్యాహ్నం ఢిల్లీ ఫ్లైట్ ఎక్కనున్నారు. ఢిల్లీకి వెళ్లిన తరువాత ప్రతిపక్ష నేతలతో భేటీ కానున్నారు. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌పై సీబీఐ కేసు నమోదు చేయడం..ప్రతిపక్షాలపై చట్టబద్ధత సంస్థలతో దాడులు చేయించడం…తదితర పరిణామాలపై బాబు చర్చించనున్నారు. అదే రోజు రాత్రికి విజయవాడకు బాబు చేరుకుంటారు. మరోవైపు జగన్ కేసు ఎన్ఐఏకి అప్పగింతపై బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖకు లేఖ రాయాలని బాబు నిర్ణయించారు.