హంపి, హారిక తర్వాత ప్రత్యూషనే: అభినందించిన సీఎం జగన్

  • Published By: vamsi ,Published On : February 29, 2020 / 02:30 AM IST
హంపి, హారిక తర్వాత ప్రత్యూషనే: అభినందించిన సీఎం జగన్

Updated On : February 29, 2020 / 2:30 AM IST

విశ్వ వేదికలపై విజయాలు సాధిస్తున్నారు మన తెలుగు క్రిడాకారులు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా అంతర్జాతీయ వేదికలపై గణనీయమైన స్థాయిలో విజయాలు సాధిస్తున్న తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తెలుగు చెస్ క్రీడాకారిణి, మహిళా గ్రాండ్ మాస్టర్ బొడ్డా ప్రత్యూషను సీఎం జగన్ అభినందించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన ప్రత్యూష గ్రాండ్ మాస్టర్ నార్మ్ వచ్చిన ఆనందాన్ని సీఎంతో పంచుకున్నారు.

ఈ సంధర్భంగా ఆమెను అభినందించిన జగన్.. రాబోయే కాలంలో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరారు. ప్రభుత్వం తరపున సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రత్యూష వెంట ఆమె తల్లిదండ్రులు కూడా సీఎంను కలుసుకున్న సమయంలో ఉన్నారు. భారత్‌లో ఈ హోదా ఉన్న ఎనిమిదో క్రీడాకారిణి ప్రత్యూష. ఇప్పటిదాకా ఎనిమిది జాతీయ, 24 అంతర్జాతీయ పతకాలు గెలిచింది ప్రత్యూష.

Also Read | వైసీపీ ఎమ్మెల్యేకి తప్పిన ప్రమాదం

బొడ్డా ప్రత్యూష ఈ నెల(ఫిబ్రవరి)లోనే మహిళా గ్రాండ్‌మాస్టర్‌ టైటిల్‌ సాధించింది. ఇంగ్లాండ్‌లో జరిగిన జిబ్రాల్టర్‌ ఓపెన్‌ చెస్‌ టోర్నమెంట్లో ప్రత్యూషకు మూడో మహిళా గ్రాండ్‌మాస్టర్‌ నార్మ్‌ లభించింది. మూడేళ్ల క్రితం తొలి రెండు నార్మ్‌లు సాధించిన ప్రత్యూష.. ఇటీవల జిబ్రాల్టర్‌ టోర్నీలో మూడో నార్మ్‌ అందుకోవడం ద్వారా ఈ హోదా సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక మాత్రమే ఇప్పటివరకు మహిళా గ్రాండ్‌మాస్టర్‌ టైటిల్‌ సాధించారు.