China sending fighter jets: థాయిలాండ్‌కు యుద్ధ విమానాలు, బాంబర్లు పంపుతోన్న చైనా

థాయిలాండ్‌కు చైనా యుద్ధ విమానాలు, బాంబర్లను పంపుతోంది. తమ దేశంతో సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించడానికి చైనా నుంచి యుద్ధ విమానాలు వస్తున్నాయని థాయిలాండ్ ఇవాళ ఓ ప్రకటనలో వివరించింది. గగనతల రక్షణ వ్యవస్థను పెంపొందించుకోవడం, సైనికులను మోహరించడం, భూతల లక్ష్యాలపై దాడులు చేసేందుకు శిక్షణ వంటి వాటిపై దృష్టిపెట్టి ఈ విన్యాసాలు ప్రారంభిస్తామని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ చెప్పింది.

China sending fighter jets: థాయిలాండ్‌కు యుద్ధ విమానాలు, బాంబర్లు పంపుతోన్న చైనా

China sending fighter jets

Updated On : August 13, 2022 / 7:38 PM IST

China sending fighter jets: థాయిలాండ్‌కు చైనా యుద్ధ విమానాలు, బాంబర్లను పంపుతోంది. తమ దేశంతో సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించడానికి చైనా నుంచి యుద్ధ విమానాలు వస్తున్నాయని థాయిలాండ్ ఇవాళ ఓ ప్రకటనలో వివరించింది. గగనతల రక్షణ వ్యవస్థను పెంపొందించుకోవడం, సైనికులను మోహరించడం, భూతల లక్ష్యాలపై దాడులు చేసేందుకు శిక్షణ వంటి వాటిపై దృష్టిపెట్టి ఈ విన్యాసాలు ప్రారంభిస్తామని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ చెప్పింది.

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దుందుడుకు చర్యలు చేపడుతుండడంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తూ తమ మిత్రదేశాలతో పలు చర్యలు తీసుకుంటోన్న వేళ థాయిలాండ్ తో కలిసి చైనా సైనిక విన్యాసాలు నిర్వహిస్తుండడం గమనార్హం. థాయిలాండ్ లోని ఉడోర్న్ రాయల్ థాయ్ ఎయిర్ ఫోర్స్ బేస్ లో ఈ సైనిక శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇండోనేషియాలో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, సింగపూర్ దేశాలు యుద్ధ విన్యాసాలు చేపట్టిన నేపథ్యంలో థాయిలాండ్ లో చైనా సంయుక్త సైనిక విన్యాసాలు చేపడుతుండడం గమనార్హం.

అలాగే, తైవాన్ విషయంలో చైనా మరిన్ని చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. దీనిపై కూడా అమెరికా పలుసార్లు హెచ్చరించింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కొనసాగేందుకు కృషి చేయాలని, సానుకూల వాతావరణాన్ని చెడగొట్టేలా దుందుడుకు చర్యలకు పాల్పడవద్దని చెప్పింది. అయినప్పటికీ చైనా తన చర్యలు కొనసాగిస్తోంది.

Weather alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం