ఉల్లిపై ఏపీ ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్
ఆకాశాన్ని అంటుతున్న ఉల్లి ధరలతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్కెట్ లో కిలో ఉల్లి ధర రూ.100 పలుకుతోంది. దీంతో ఉల్లి కొనే సాహసం చేయలేకపోతున్నారు. పేద,

ఆకాశాన్ని అంటుతున్న ఉల్లి ధరలతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్కెట్ లో కిలో ఉల్లి ధర రూ.100 పలుకుతోంది. దీంతో ఉల్లి కొనే సాహసం చేయలేకపోతున్నారు. పేద,
ఆకాశాన్ని అంటుతున్న ఉల్లి ధరలతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్కెట్ లో కిలో ఉల్లి ధర రూ.100 పలుకుతోంది. దీంతో ఉల్లి కొనే సాహసం చేయలేకపోతున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఉల్లిపాయలు తినడమే మానేశారు. ఉల్లి ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఏపీ సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. ప్రజల ఉల్లి కష్టాలు తీర్చేందుకు చర్యలు చేపట్టారు. ఉల్లి ధరల సమస్య పరిష్కారానికి మార్గాలు వెతుకుతున్నారు. ఇందులో భాగంగా ప్రజలకు రిలీఫ్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్.
ధరలు తగ్గే వరకు రైతు బజార్లలో రూ.25కే కిలో ఉల్లిని విక్రయించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రైతు బజార్లలో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి విక్రయాలు జరపాలన్నారు. ఉల్లి విషయంలో ప్రభుత్వంపై ఎంత ఆర్థిక భారం పడినా పర్లేదని.. ప్రజలు మాత్రం ఇబ్బందులు పడకూడదని సీఎం జగన్ అధికారులతో చెప్పారు.
మార్కెటింగ్ శాఖ ద్వారా ప్రతీ రోజూ రైతు బజార్లలో ఉల్లి విక్రయాలు చేపట్టాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వమే ఉల్లిని కొనుగోలు చేయాలని చెప్పారు. ఇందుకోసం ధరల స్థిరీకరణ నిధి నుంచి సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తోంది. గడిచిన 18 రోజుల్లో 16వేల క్వింటాళ్ల ఉల్లిని జగన్ ప్రభుత్వం సరఫరా చేసింది. 18 రోజుల్లో రూ.9.50 కోట్ల ఖర్చుతో ఉల్లిని కొనుగోలు చేసింది. దీంతో ప్రభుత్వంపై రూ.5.83 కోట్ల ఆర్థిక భారం పడింది. ప్రభుత్వంపై ఎంత ఆర్థిక భారం పడినా ఇబ్బంది లేదని సీఎం జగన్ చెప్పారు.
ఇక అక్రమంగా ఎవరైనా ఉల్లిపాయలు నిల్వ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. మార్కెటింగ్, విజిలెన్స్, పౌర సరఫరాల శాఖల సమన్వయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలన్నారు. ఉల్లి ధరలు తగ్గే వరకు కిలో ఉల్లి రూ.25కే విక్రయించాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. సీఎం జగన్ ప్రజల సమస్యను అర్థం చేసుకున్నారని, తమపై ఆర్థిక భారం పడకుండా చర్యలు తీసుకోవడం ఆనందంగా ఉందని అంటున్నారు.