కల సాకారం : భువనగిరి జిల్లాకు త్వరలో నీళ్లు
భువనగిరి జిల్లా ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ శుభవార్త వినిపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తికాగానే భువనగిరి జిల్లాకు నీళ్లు ఇస్తామని కేసీఆర్ చెప్పారు.

భువనగిరి జిల్లా ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ శుభవార్త వినిపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తికాగానే భువనగిరి జిల్లాకు నీళ్లు ఇస్తామని కేసీఆర్ చెప్పారు.
భువనగిరి జిల్లా ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ శుభవార్త వినిపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ త్వరలోనే పూర్తి కానుందని..అది పూర్తికాగానే భువనగిరి జిల్లాకు తాగు, సాగు నీరు ఇస్తామని కేసీఆర్ చెప్పారు. జులై నాటికి కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయ్యే అవకాశం ఉందని కేసీఆర్ తెలిపారు. అదే నెలలో భువనగిరి ప్రాంతానికి గోదావరి నీళ్లు వస్తాయన్నారు. 2020 నాటికి 10లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే బాధ్యత తనది అన్నారు. రుద్రమ చెరువు పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. మిషన్ భగీరథ లాంటి పథకం దేశంలో ఎక్కడా లేదన్న కేసీఆర్.. ఆ ప్రాజెక్ట్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నామన్నారు. భువనగిరిలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడారు. యాదాద్రి ప్రపంచ పర్యాటక క్షేత్రంగా విలసిల్లనుందని కేసీఆర్ చెప్పారు. బూరనర్సయ్య కృషితో జిల్లాకు ఎయిమ్స్ వచ్చిందన్న కేసీఆర్.. ఈ జూన్ నుంచే అడ్మిషన్లు జరుగుతాయన్నారు.
Read Also : కల సాకారం : భువనగిరి జిల్లాకు త్వరలో నీళ్లు
ఎన్నికలు వస్తే గెలవాల్సింది ప్రజలు అని కేసీఆర్ చెప్పారు. ఈ ఎన్నికల్లో ఆగమాగం కావొద్దని.. అభివృద్ధి చేసే వారికే ఓటు వెయ్యాలని కేసీఆర్ సూచించారు. కాంగ్రెస్, బీజేపీ వల్ల ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకపోయి ఉంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం రాకపోయి ఉంటే జన్మలో భువనగిరి జిల్లా వచ్చి ఉండేది కాదని కేసీఆర్ అన్నారు. ఈ ఐదేళ్లలో తెలంగాణలో గణనీయమైన అభివృద్ధి జరిగిందన్నారు. ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదు ప్రజలు అని కేసీఆర్ చెప్పారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉందన్నారు. రైతు బంధు పథకం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు.