అది నోరేనా: వితంతువులపై నోరు పారేసుకున్న మంత్రి అయ్యన్న

  • Published By: veegamteam ,Published On : January 3, 2019 / 10:22 AM IST
అది నోరేనా: వితంతువులపై నోరు పారేసుకున్న మంత్రి అయ్యన్న

విశాఖపట్నం :  వితంతువులపై అయ్యన్న పాత్రుడు నోరు పారేసుకున్నారు. విశాఖపట్నం జిల్లాలో జన్మభూమి కార్యక్రమం సందర్భంగా దుక్కల్లా ఉండి పెన్షన్ కావాలంటే ఎలా ఇస్తామండీ? అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై  తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. జన్మభూమి కార్యక్రమం సందర్భంగా జనవరి 2న  విశాఖలో నిర్వహించిన సమావేశంలో మంత్రి అయ్యన్న సదస్సుకు హాజరైన మహిళలు, వితంతువులను ఉద్దేశించి మాట్లాడుతూ..‘దుక్కలా ఉండి పెన్షల్ కావాలంటే ఎవరు ఇస్తారండి? ఊర్లలో కొంతమంది మహిళలు భర్త ఉన్నాడా? అని అడిగితే లేడని చెబుతారు. చనిపోయాడా? అని ప్రశ్నిస్తే తెలియదు బాబూ అంటారనీ..అసలు ఇల్లు వదిలి ఎప్పుడు వెళ్లాడు అని మళ్లీ అడిగితే.. ఎప్పుడో పదేళ్ల క్రితం వెళ్లిపోయాడరనీ ఎద్దేవా చేశారు. ఎవరైనా ఊరికే ఎందుకెళ్లిపోతారు. వాళ్లను రాచి రంపాన పెడితేనే వదిలిపోతారు. ఇలాంటి దిక్కుమాలినోళ్లు ప్రతీ ఊరిలోనూ ఇద్దరు, ముగ్గురు ఉన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి వీరందరికి వితంతు పెన్షన్లు వచ్చేలా చేస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 56 లక్షల మందికి పెన్షన్ అందజేస్తోందని తెలిపారు.