కరోనా కాలం కృష్ణుడు..కరోనా పేషెంట్ వేణుగానం వింటే మైమరచిపోవాల్సిందే : వైరల్ వీడియో

కరోనా వైరస్ ఎక్కడ సోకుతుందో అని ప్రజలు భయపడి ఛస్తుంటే..కొందరు కరోనా బాధితులు మాత్రం క్వారంటైన్ సెంటర్లో ఆడుతూ పాడుతూ ఉల్లసంగా ఉత్సాహంగా గడుపుతున్నారు. జోకులేసుకుంటూ..ఎవరి టాలెంట్ వారు చూపించుకుంటున్నారు. క్వారంటైన్ సెంటర్లలో కొత్త కొత్త స్నేహితుల్ని సంపాదించుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఓ సంఘటన అస్సాంలోని డిబ్రుగఢ్ లో ఉన్న ఓ క్వారంటైన్ సెంటర్లో ఓ కరోనా బాధితుడు తన టాలెంట్ ను చూపించాడు. వేణువుతో మురళీగానం వినిపించాడు. వినసొంపైన ఆ వేణుగానానికి తోటి కరోనా బాధితులంతా ఈలలు వేస్తూ..చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేశారు.
కరోనా వైరస్ సోకి కుటుంబానికి దూరంగా క్వారంటైన్ సెంటర్ లో ఉంటున్న ఓ బాధితుడు పిల్లనగ్రోవి వాయిస్తూ మిగతా బాధితులకు వినోదం కల్పిస్తున్నాడు. సదరు బాధితుడు పిల్లన గ్రోవి వాయిస్తుంటే మిగతా కరోనా వైరస్ బాధితులంతా అలనాడు గోకులంలో శ్రీకృష్ణుడు తన వేణుగానంతో గోపికలను..గోవులను..తోటి గోపారులను మైమరపించాడు. ఈనాటీ ఈకరోనా బాధితుడు మాత్రం ఆ వేణుగానానికి తోటి బాధితులను అలరించాడు. తన్మయత్వంతో నృత్యం చేయించాడు. దీనిని గమనించిన డాక్టర్లు ఇలాంటి కార్యక్రమాలు బాధితుల్లో ఆత్మ విశ్వాసం నింపుతాయని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#WATCH Coronavirus patients dance and sing at a quarantine centre in Dibrugarh, Assam. (23.07.20) pic.twitter.com/SBjtIrSdks
— ANI (@ANI) July 24, 2020