ఏపీలో కరోనా కల్లోలం, 722కి పెరిగిన కేసులు, 24 గంటల్లో 75 కొత్త కేసులు

కరోనా వైరస్ ఏపీలో విజృంభిస్తోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 75 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 722కి చేరింది. ఏపీలో ఇప్పటివరకు కరోనాతో 20మంది చనిపోయారు. 92మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 610మంది కరోనా బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ 75 కొత్త కేసుల్లో.. అనంతపురం జిల్లాలో కొత్తగా 4 కేసులు, చిత్తూరు జిల్లాలో 25, తూర్పుగోదావరి జిల్లాలో 2, గుంటూరు జిల్లాలో 20, కడప జిల్లాలో 3, కృష్ణా జిల్లాలో 5, కర్నూలు జిల్లాలో 16 కొత్త కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 3వేల 775 శాంపుల్స్ పరీక్షిస్తే 75మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.
* ఏపీలో కరోనా కల్లోలం
* 24 గంటల్లో 75 కొత్త కేసులు
* 722కి చేరిన కరోనా కేసులు
* ఇప్పటివరకు 20మంది మృతి
* 92మంది కోలుకున్నారు
* యాక్టివ్ కేసులు 610
జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు:
అనంతపురం – 33
చిత్తూరు – 53
తూర్పుగోదావరి – 26
గుంటూరు – 149
కడప – 40
కృష్ణా – 80 (14 మంది డిశ్చార్జ్, ఆరుగురు మృతి, యాక్టివ్ కేసులు 60)
కర్నూలు – 174( ఒకరు డిశ్చార్జ్, ఐదుగురు మృతి, యాక్టివ్ కేసులు 168)
నెల్లూరు – 67( ఒకరు డిశ్చార్జ్, ఇద్దరు మృతి, యాక్టివ్ కేసులు 64)
ప్రకాశం – 44(ఒకరు డిశ్చార్జ్, యాక్టివ్ కేసులు 43)
పశ్చిమగోదావరి – 35(9మంది డిశ్చార్జ్, యాక్టివ్ కేసులు 26)
విశాఖ – 21(18మంది డిశ్చార్జ్, యాక్టివ్ కేసులు 3)
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.