ఢిల్లీ భయం నిజమైంది, ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు, సీఎం జగన్ సొంత జిల్లాలో హైఅలర్ట్

  • Published By: veegamteam ,Published On : April 1, 2020 / 06:57 AM IST
ఢిల్లీ భయం నిజమైంది, ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు, సీఎం జగన్ సొంత జిల్లాలో హైఅలర్ట్

Updated On : April 1, 2020 / 6:57 AM IST

భయం నిజమైంది. ఏపీలో ఢిల్లీ బాంబు పేలింది. రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభించింది. ఒక్కసారిగా కోవిడ్ 19 కేసుల సంఖ్య డబుల్ అయ్యింది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 87కి పెరిగింది. ఈ ఒక్కరోజే 43 మందికి కరోనా సోకింది. ఢిల్లీ నుంచి వచ్చిన వారిలోనే కరోనా ఎక్కువగా ఉంది. దీంతో ఏపీలో కలకలం రేగింది. ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా లేని రెండు జిల్లాల్లో ఒక్కసారిగా పదుల సంఖ్య కేసులు నమోదయ్యాయి. సీఎం జగన్ సొంత జిల్లా కడపలో 15, పశ్చిమగోదావరి జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. 

మంగళవారం(మార్చి 31,2020) రాత్రి 9 గంటల నుంచి బుధవారం(ఏప్రిల్ 1,2020) ఉదయం 9 గంటల మధ్య 43 కొత్త కేసులు నమోదైనట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్ లో తెలిపింది. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి మెరుగైనట్లు తెలిపింది. గత 12 గంటల వ్యవధిలో 373మంది నమూనాలు పరీక్షించగా అందులో 330 నెగిటివ్ గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు.

దీంతో ఏపీలో వైరస్ భయం నెలకొంది. కేసుల సంఖ్య భారీగా పెరగడంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఢిల్లీలో మతపరమైన ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారిలోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదైనట్టు గుర్తించిన అధికారులు వారిపై మరింత ఫోకస్ పెట్టారు. జిల్లాల్లో కోవిడ్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఒక్క ప్రకాశం జిల్లాలోనే ఇప్పటివరకు 15 కేసులు నమోదయ్యాయి. ఫస్ట్ టైమ్ కడపలో 15 కేసులు, పశ్చిమగోదావరి జిల్లాలో 13 కేసులో నమోదయ్యాయి. విశాఖలో 13, గుంటూరులో 9, కృష్ణా జిల్లాలో 6, తూర్పుగోదావరి జిల్లాలో 6, అనంతపురం జిల్లాలో 2, చిత్తూరు జిల్లాలో 6, నెల్లూరు జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో ఒక కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఢిల్లీకి లింక్ ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు.

కడప జిల్లా సీఎం జగన్ సొంత జిల్లా కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. నిన్నటి వరకు ఒక్క కరోనా కేసు కూడా లేని కడప జిల్లాలో ఏకంగా 15 మందికి కరోనా సోకడం కలకలం రేపుతోంది. కరోనా కట్టడికి అధికారులు మరిన్ని చర్యలు చేపట్టారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. వారి కుటుంబసభ్యులను ఐసోలేషన్ వార్డులకు తరలిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారు ఎవరిని కలిశారు? ఎక్కడ తిరిగారు? వంటి వివరాలు తెలుసుకుంటున్నారు.

మార్చి 31 రాత్రి 9 నుంచి ఏప్రిల్ 1 ఉదయం 9 వరకు నమోదైన 43 కేసులు..జిల్లాల వారీగా..

1

 

* ప్రపంచవ్యాప్తంగా 203 దేశాలకు పాకిన కరోనా వైరస్
* ప్రపంచవ్యాప్తంగా 8లక్షల 56వేల 917 కరోనా పాజిటివ్ కేసులు, 42వేల 158 మరణాలు
* ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,78,100
* ఇటీలీలో లక్ష 5వేల 792 కరోనా కేసులు.. 12,428 మరణాలు
* స్పెయిన్ లో 95వేల 923 కేసులు.. 8,464 మరణాలు
* అమెరికాలో లక్ష 87వేల 347 కేసులు, 4వేల మరణాలు
* ఫ్రాన్స్ లో 52వేల 128 కేసులు.. 3,523 మంది మరణాలు

* చైనాలో 81వేల 518 కేసులు… 3,305 మరణాలు
* ఇరాన్ లో 44వేల 605 కేసులు.. 2,898 మరణాలు
* యూకేలో 25వేల 150 కేసులు.. 1,789 మరణాలు
* నెదర్లాండ్ లో 12వేల 595 కేసులు.. 1,039 మరణాలు
* జర్మనీలో 71వేల 808 కేసులు.. 775 మరణాలు
* బెల్జియంలో 12వేల 775 కేసులు.. 705 మరణాలు
* స్విట్జర్లాండ్ లో 433 మంది, టర్కీలో 214 మంది కరోనాతో మృతి

* భారత్ లో 1,637 కు చేరిన కరోనా కేసుల సంఖ్య, 52కి చేరిన కరోనా మరణాలు
* దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 142
* మహారాష్ట్రలో 320 కరోనా కేసులు, 12 మరణాలు
* కేరళలో 241 కేసులు, రెండు మరణాలు
* తమిళనాడులో 124 కేసులు, ఒకరు మృతి
* ఢిల్లీలో 120 కేసులు, ఇద్దరు మృతి
* కర్నాటకలో 101 కేసులు, మూడు మరణాలు
* గుజరాత్ లో 74 కేసులు, ఆరు మరణాలు
* యూపీలో 108 కేసులు
* మధ్యప్రదేశ్ లో 86 కేసులు, నాలుగు మరణాలు
* జమ్ముకశ్మీర్ లో 55 కేసులు, రెండు మరణాలు
* పంజాబ్ లో 41 కేసులు, 4 మరణాలు
* బెంగాల్ లో 32 కేసులు, మూడు మరణాలు
* హరియానాలో 25 కేసులు
* బీహార్ లో 21 కేసులు, ఒకరు మృతి
* చండీగడ్ లో 13, లఢఖ్ లో 13 కేసులు, అండమాన్ లో 10,  చత్తీస్ గడ్ లో 9,  ఉత్తరాఖండ్ లో 7, గోవాలో 5, ఒడిశాలో 4 కేసులు
* రాజస్థాన్ లో 93 కేసులు
* హర్యానాలో 43 కేసులు
* హిమాచల్ ప్రదేశ్ లో 3 కేసులు, ఒకరు మృతి
* మణిపూర్, మిజోరం, ఝార్ఖండ్, అసోం, పుదుచ్చేరిలో ఒక్కో కేసు నమోదు
* ఏపీలో 87 కరోనా కేసులు
* తెలంగాణలో 97 కరోనా కేసులు, ఆరు మరణాలు, 14మంది డిశ్చార్జ్ 

Also Read | పశ్చిమగోదావరి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు