ఎలక్షన్ ఫీవర్ : జగన్ పార్టీలో చేరిన దాడి వీరభద్రరావు

అమరావతి : మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తిరిగి సొంత గూటికి చేరారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పాదయాత్ర తర్వాత జగన్ లో మెచ్యూరిటీ వచ్చిందన్నారు. గతంతో పోల్చితే ఎంతో మార్పు కనిపిస్తుందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబు తీరుపై విమర్శలు చేశారాయన.
Read Also : చంద్రబాబు షాక్ : డేటా కేసులో కీలక సాక్ష్యం నా దగ్గర ఉంది
ఆరోపణలు చేయటంలో చంద్రబాబు సిద్ధహస్తులనీ.. గంటకో మాట మార్చటం ఆయనకు అలవాటు అంటూ.. మల్టీ టంగ్ చంద్రబాబు అంటూ చురకలు అంటించారు. స్థానికంగా ఉండే కొన్ని పరిస్థితుల వల్ల పార్టీకి దూరం కావాల్సి వచ్చిందనీ.. ఇప్పుడు అవన్నీ క్లియర్ అయిపోయాయి అన్నారు. అందుకే తిరిగి వైసీపీలోకి చేరుతున్నట్లు వెల్లడించారు.
కొన్ని రోజులుగా టీడీపీ అని, జనసేనలో చేరుతారంటూ ప్రచారం జరిగింది. పవన్ కల్యాణ్ స్వయంగా వెళ్లి దాడిని కలవడంతో ఆయన చేరిక ఖాయం అనుకున్నారు. ఎందుకో మరి అటువైపు వెళ్లలేదు. దీనికి కారణం కూడా లేకపోలేదు. దాడి రాజకీయ ప్రత్యర్థి కొణతాల రామకృష్ణ టీడీపీలో చేరుతుండటంతో.. దాడి ఆ ఆలోచనను విరమించుకున్నట్టు తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటానికి కూడా ఇదే కారణం అంటున్నారు.
Read Also : గుంటూరులో టీడీపీ లేకుండా చేస్తా : వైసీపీలో చేరి మోదుగుల సవాల్