చింతమనేని ఎక్కడ : ఎస్పీ ఆఫీసుకు క్యూ కట్టిన బాధితులు

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేనికి ఉచ్చు బిగుస్తోంది. ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ స్వయంగా రంగంలోకి దిగి..చింతమనేనిపై నమోదైన కేసుల వివరాలను సేకరిస్తున్నారు. 2019, సెప్టెంబర్ 05వ తేదీ గురువారం ఏలూరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి వచ్చారు.
29 కేసుల బాధితులను పిలిచి ఆధారాలు సేకరించారు ఎస్పీ. అయితే..బాధితుల సంఖ్య పెరుగుతోంది. చింతమనేనిపై 20 ఏళ్లలో 50 కేసులకు పైగానే ఉన్నాయని..అయినా..ఎందుకు విచారించలేదనే దానిపై ఆరా తీశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ భావిస్తున్నారు. చింతమనేని అరెస్టుకు అన్ని ఆధారాలను, పాత కేసుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. త్వరలోనే కేసులను పరిష్కరించి..బాధితులకు న్యాయం చేకూరుస్తామని ఎస్పీ హామీనిస్తున్నారు.
ఇదిలా ఉంటే గత 6 రోజులుగా చింతమనేని ప్రభాకర్ అజ్ఞాతంలో ఉన్నారు. కోర్టులో లొంగిపోతారంటూ ఊహాగానాలు వచ్చాయి. దీంతో బుధవారం ఏలూరు కోర్టు పరిసర ప్రాంతాల్లో పోలీసులు మఫ్టీలో మోహరించాయి. సాయంత్రం వరకు వేచి చూసినా చింతమనేని లొంగిపోలేదు. న్యాయమూర్తి దగ్గరకు వస్తారని భావించినా