అమరావతిలో టెన్షన్..టెన్షన్ : జీఎన్ రావు కమటీ నివేదికకు వ్యతిరేకంగా రైతుల నిరసన

జీఎన్ రావు కమటీ నివేదికకు వ్యతిరేకంగా రైతుల నిరసన తెలిపారు. అమరావతి వెలగపూడి సెంటర్ దగ్గర రైతులు ఆందోళన చేపట్టారు.

  • Published By: veegamteam ,Published On : December 20, 2019 / 01:30 PM IST
అమరావతిలో టెన్షన్..టెన్షన్ : జీఎన్ రావు కమటీ నివేదికకు వ్యతిరేకంగా రైతుల నిరసన

Updated On : December 20, 2019 / 1:30 PM IST

జీఎన్ రావు కమటీ నివేదికకు వ్యతిరేకంగా రైతుల నిరసన తెలిపారు. అమరావతి వెలగపూడి సెంటర్ దగ్గర రైతులు ఆందోళన చేపట్టారు.

జీఎన్ రావు కమటీ నివేదికకు వ్యతిరేకంగా రైతుల నిరసన తెలిపారు. అమరావతి వెలగపూడి సెంటర్ దగ్గర రైతులు ఆందోళన చేపట్టారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. జీఎన్ రావును అడ్డుకునేందుకు రోడ్డుపై రైతులు ధర్నా చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో జీఎన్ రావును పోలీసులు మరో మార్గంలో పంపించారు. రైతుల ఆందోళనతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. 

జగన్ కు పరిపాలన అనుభవ రాహిత్యం ఉందని విమర్శించారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి జగన్ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రైతుల ఆందోళనతో సచివాలయ ప్రాతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు భారీగా మోహరించారు. గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘనలు చోటు చేసుకోకుండా భద్రత చర్యలు తీసుకున్నారు. 

ఏపీ రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ సీఎం జగన్ కు నివేదిక ఇచ్చింది. సీఎంకు ఇచ్చిన నివేదికలో చేసిన సూచనలను, సిఫార్సులను కమిటీ సభ్యులు మీడియాకు వివరించారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని తాము నివేదికలో సూచించామని కమిటీ సభ్యులు తెలిపారు. విశాఖలో సీఎంవో, సచివాలయం, వేసవి అసెంబ్లీ, హైకోర్టు బెంచ్.. అమరావతిలో అసెంబ్లీ, రాజ్ భవన్, మంత్రుల క్వార్టర్స్, హైకోర్టు బెంచ్, సీఎం క్యాంప్ ఆఫీస్.. కర్నూలులో హైకోర్టు, సీఎం క్యాంప్ ఆఫీస్, శీతాకాల అసెంబ్లీ ఏర్పాటు చేయాలని నివేదికలో సూచించామన్నారు. అంతేకాదు.. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రాన్ని 4 రీజియన్ లుగా విభజించాలని తాము సిఫార్సు చేసినట్టు కమిటీ సభ్యులు వివరించారు. ఉత్తర, మధ్య, దక్షిణ కోస్తా, రాయలసీమ రీజియన్ లుగా రాష్ట్రాన్ని విభజించాలని కోరామన్నారు.

సెప్టెంబర్ నుంచి శోధించిన అంశాలపై నివేదిక రూపొందించామని, దాన్ని సీఎంకు ఇచ్చామని కమిటీ సభ్యులు తెలిపారు. ప్రధానంగా రెండు అంశాలపై (రాజధాని, అభివృద్ధి) తాము అధ్యయనం జరిపామని, మూడు ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నామని కమిటీ సభ్యులు వివరించారు. ఏపీలో ప్రాంతీయ అసమానతలు ఉన్నట్టు తాము గుర్తించామన్నారు. మూడు ప్రాంతాల సమస్యలపై తాము పరిశీలన చేశామన్నారు. రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా జరగాలి, అందుకోసం ఏం చేస్తే బాగుంటుంది అనే సూచనలు, సిఫార్సులు నివేదికలో పొందుపరిచామని కమిటీ సభ్యులు చెప్పారు.