చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో భారీ అగ్నిప్రమాదం
చిత్తూరు కలెక్టరేట్‌లో బుధవారం(ఏప్రిల్ 10, 2019) అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కొన్ని కీలక డాక్యుమెంట్లు, పరికరాలు, ఏసీలు కాలి బూడదయ్యాయి.

చిత్తూరు కలెక్టరేట్‌లో బుధవారం(ఏప్రిల్ 10, 2019) అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కొన్ని కీలక డాక్యుమెంట్లు, పరికరాలు, ఏసీలు కాలి బూడదయ్యాయి.
చిత్తూరు కలెక్టరేట్‌లో బుధవారం(ఏప్రిల్ 10, 2019) అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కొన్ని కీలక డాక్యుమెంట్లు, పరికరాలు, ఏసీలు కాలి బూడదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్‌సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలింగ్ ను కలెక్టరేట్ నుంచే పర్యవేక్షించి, ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చేందుకు వివేకానంద భవన్‌లోని రెండో అంతస్తులో ఏర్పాట్లు చేశారు.
భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌తోపాటు 112 ల్యాప్‌టాప్‌లతో సర్వం సిద్ధం చేశారు. ఇదే గదిలో 10 వరకు ఏసీలు, 30 వరకు ఫ్యాన్లు, ఇతర సామగ్రి అందుబాటులో ఉంచారు. అగ్నిప్రమాదంలో ఇవన్నీ కాలి బూడిదయ్యాయి. విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న అక్కడికి చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హాల్ లోనే ప్రమాదం సంభవించడం అనుమానాలకు తావిస్తోంది.