పశ్చిమగోదావరి జిల్లాలో మొట్టమొదటి కోడి పందెం : ఏలూరులో ప్రారంభం

పశ్చిమగోదావరి జిల్లాలో మొట్టమొదటి కోడి పందానికి సిద్ధమయ్యారు. ఏలూరులో కోడి పందాలు ప్రారంభం కాబోతున్నాయి.

  • Published By: veegamteam ,Published On : January 14, 2020 / 07:23 AM IST
పశ్చిమగోదావరి జిల్లాలో మొట్టమొదటి కోడి పందెం : ఏలూరులో ప్రారంభం

Updated On : January 14, 2020 / 7:23 AM IST

పశ్చిమగోదావరి జిల్లాలో మొట్టమొదటి కోడి పందానికి సిద్ధమయ్యారు. ఏలూరులో కోడి పందాలు ప్రారంభం కాబోతున్నాయి.

పశ్చిమ గోదావరిలో కోడిపందాల నిర్వహణ తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. పందాల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా భారీగా బరులు ఏర్పాటయ్యాయి. ఏలూరు సమీపంలోనూ ఇలానే అతిపెద్ద బరిని పందెం రాయుళ్లు ఏర్పాటు చేశారు. అయితే.. కోడిపందాలు నిర్వహించడానికి వీల్లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. బరులు ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. అయితే పందెంరాయుళ్లు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సంక్రాంతికి పందె నిర్వహించడం తమ సంప్రదాయమంటూ గొడవపడ్డారు. దీంతో.. పోలీసులు వెనుదిరిగారు. 

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.ఏలూరులో కోడిపందాలను అడ్డుకున్నారు. కోడి పందాల కోసం వేసిన టెంట్లు, బరులు తీసేశారు. పోలీసులు, పందేంరాయుళ్లకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఒకరిపై మరొకరు దాడి చేసుకునే పరిస్థితి వచ్చింది. నిర్వాహకుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉండటంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. 

పశ్చిమగోదావరి జిల్లాలో మొట్టమొదటి కోడి పందానికి సిద్ధమయ్యారు. ఏలూరులో కోడి పందాలు ప్రారంభం కాబోతున్నాయి. భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, జంగారెడ్డి ఏజెన్సీలో బాగా జరుగుతాయి. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క చోట కూడా కోడి పందాలు ప్రారంభం కాలేదు. కానీ మొట్టమొదటి పందానికి రంగం సిద్ధం అయింది. పందేం రాయుళ్లు పందెం కోళ్లను వరుసలో ఉంచారు. మొదటి పందెం వేయడానికి సిద్ధంగా ఉన్నారు.