సాయంత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫస్ట్‌లిస్ట్

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను సాయంత్రం విడుదల చేయనుంది. సాయంత్రం 5గంటలకు వైఎస్ఆర్ పార్టీలో ముఖ్య నేతలు చేరనున్న క్రమంలో వారికి కండువాలు కప్పిన అనంతరం వివేకానంద మృతికి సంఘీభావం తెలిపి జాబితాను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.
మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర చర్చా వేదిక అధ్యక్షుడు కొణతాల రామకృష్ణ, నెల్లూరు జిల్లాకు చెందిన ముఖ్యనేత ఆదాల ప్రభాకర్ రెడ్డి, జగన్ సమక్షంలో వైకాపాలో చేరనున్నారు. వీరితోపాటు తెదేపా ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యురాలు వంగా గీత కూడా వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వీరి చేరిక అనంతరం జగన్ అభ్యర్ధుల ఫస్ట్‌లిస్ట్ విడుదల చేయనున్నారు. మరోవైపు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కూడా సాయంత్రం జగన్‌తో భేటీ అవనున్నారు.