ప్రభుత్వం కీలక నిర్ణయం : టెన్త్ క్వశ్చన్ పేపర్ లో మార్పులు
ఏపీ ప్రభుత్వం టెన్త్ పరీక్షల్లో కీలక సంస్కరణలకు తెరలేపింది. టెన్త్ క్వశ్చన్ పేపర్ లో మార్పులు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 20శాతం ఇంటర్నల్ అసెస్ మెంట్

ఏపీ ప్రభుత్వం టెన్త్ పరీక్షల్లో కీలక సంస్కరణలకు తెరలేపింది. టెన్త్ క్వశ్చన్ పేపర్ లో మార్పులు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 20శాతం ఇంటర్నల్ అసెస్ మెంట్
ఏపీ ప్రభుత్వం టెన్త్ పరీక్షల్లో కీలక సంస్కరణలకు తెరలేపింది. టెన్త్ క్వశ్చన్ పేపర్ లో మార్పులు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 20శాతం ఇంటర్నల్ అసెస్ మెంట్ మార్కులతో పాటు బిట్ పేపర్ రద్దు చేసింది. ఇకపై క్వశ్చన్ పేపర్ లోనే భాగంగా బిట్ పేపర్ ఉంటుంది. ప్రైవేట్ స్కూళ్ల అక్రమాలను కట్టడి చేసేందుకు ఈ సంస్కరణలు తీసుకొచ్చామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పరీక్షల్లో విద్యార్థులకు అదనంగా 15 నిమిషాల వ్యవధి ఇస్తామన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే మార్పు అమలు చేస్తామన్నారు.
ఇంటర్నల్ అసైన్ మెంట్ మార్కులు కార్పొరేట్ స్కూళ్లకు వరంగా మారాయని మంత్రి ఆరోపించారు. 45వేల 390 స్కూళ్లలో తల్లిదండ్రుల కమిటీలు ఏర్పాటయ్యాయని, కమిటీ సభ్యులకు త్వరలో ట్రైనింగ్ ఇస్తామని మంత్రి తెలిపారు. ఇంకా 927 స్కూళ్లలో కమిటీలు ఏర్పాటు కావాల్సి ఉందన్నారు. విద్యా హక్కు చట్టం అమలు, ఫీజుల నియంత్రణపై కమిటీలు పర్యవేక్షిస్తాయని మంత్రి వివరించారు. టెన్త్ పరీక్షల్లో మాస్ కాపీని అరికట్టేందుకు చిత్తశుద్ధితో ఉన్నామని మంత్రి చెప్పారు.