ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. ఎన్నికల నిర్వహిణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

  • Published By: veegamteam ,Published On : January 8, 2020 / 07:51 AM IST
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

Updated On : January 8, 2020 / 7:51 AM IST

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. ఎన్నికల నిర్వహిణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. ఎన్నికల నిర్వహిణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడునుంది. ఈ నెల 17 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని కోర్టు సూచించింది. అలాగే పంచాయతీ ఎన్నికలకు ఫిబ్రవరి 8వ తేదీన నోటిఫికేషన్ ఇవ్వాలని కోర్టు తెలిపింది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియను మార్చి 3 వ తేదీ నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని కోర్టు తెలిపింది. 

రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని, మూడు దశలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశిచింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కేటాయించింది. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లు, అందులో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన అఫిడవిట్ ను హైకోర్టు ఆమోదించింది. 59.85 శాతం రిజర్వేషన్ల అమలుపై స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహిణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది.