కోవిడ్ గైడ్ లైన్స్ సడలింపు….రాజకీయ సమావేశాలకు గ్రీన్ సిగ్నల్

  • Published By: venkaiahnaidu ,Published On : October 8, 2020 / 05:17 PM IST
కోవిడ్ గైడ్ లైన్స్ సడలింపు….రాజకీయ సమావేశాలకు గ్రీన్ సిగ్నల్

Updated On : October 8, 2020 / 5:35 PM IST

Home ministry modifies Covid-19 guidelines బిహార్​లో అసెంబ్లీ ఎన్నికలు, మరో 11 రాష్ట్రాల్లో పార్లమెంట్, శాసన సభ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్న వేళ… ఎన్నికల ప్రచారానికి ఇబ్బంది కలగకుండా సెప్టెంబర్-30న జారీ చేసిన అన్ లాక్ నియమాలను గురువారం కేంద్ర హోం శాఖ సడలించింది. ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాల్లో 100 మందికి మించకుండా రాజకీయ సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు కేంద్రహోంశాఖ వీలు కల్పించింది.



తాజా ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. అయితే, సమావేశాలు కేవలం కంటైన్మెంట్ జోన్ల బయటే జరగాలని ఆదేశించింది. సమావేశాల్లో కరోనా జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని ఆదేశించింది. భౌతిక దూరం, మాస్కులు లేకుండా హాజరు కావద్దని తెలిపింది.

బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు…తెలంగాణ,మధ్యప్రదేశ్,గుజరాత్,కర్ణాటక,హర్యానా,జార్ఖండ్,ఛత్తీస్ ఘడ్,మనిపూర్,నాగాలాండ్,ఒడిషా,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఉపఎన్నికలు జరుగనున్నాయి.