ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలు : ఎక్కడికక్కడే అడ్డుకుంటున్న పోలీసులు

ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలకు భారీ ఏర్పాట్లు చేశారు. కోడి పందాల కోసం దూర ప్రాంతాలను నుంచి పందేం రాయుళ్లు చేరుకుంటున్నారు. మరోవైపు కోడి పందాలను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు.

  • Published By: veegamteam ,Published On : January 14, 2020 / 06:03 AM IST
ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలు : ఎక్కడికక్కడే అడ్డుకుంటున్న పోలీసులు

Updated On : January 14, 2020 / 6:03 AM IST

ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలకు భారీ ఏర్పాట్లు చేశారు. కోడి పందాల కోసం దూర ప్రాంతాలను నుంచి పందేం రాయుళ్లు చేరుకుంటున్నారు. మరోవైపు కోడి పందాలను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలకు భారీ ఏర్పాట్లు చేశారు. కోడి పందాల కోసం దూర ప్రాంతాలను నుంచి పందేం రాయుళ్లు చేరుకుంటున్నారు. మరోవైపు కోడి పందాలను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. సంక్రాంతి సంప్రదాయం పేరుతో క్రీడా వినోదానికి తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో పందెపు బరులు సిద్ధమౌతున్నాయి. కోడిపందాలు నిర్వహించ్చొంద్దంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా.. పందెంరాయుళ్లు మాత్రం పందాల నిర్వహణకు ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేడియాల తరహాలో కొబ్బరితోటలను చదును చేసి గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. 

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందాలకు భారీ ఏర్పాట్లు చేశారు. కోడి పందాల కోసం దూర ప్రాంతాలను నుంచి పందేం రాయుళ్లు చేరుకుంటున్నారు. మరోవైపు కోడి పందాలను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. పందాల బరులను ధ్వంసం చేస్తున్నారు. మధ్యాహ్నం నుంచి పందాలు నిర్వహిస్తామని పందెం రాయుళ్లు చెబుతున్నారు. 

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం శ్రీనివాసపురం గ్రామ సమీసంలో కోడి పందాల బరిని పోలీసులు ధ్వంసం చేశారు. కోళ్ల పందాల నిర్వహణపై కోర్టులో ఆంక్షలు ఉన్నా.. అవేమి పట్టించుకోకుండా పందాలకు కొంతమంది బరులు సిద్ధం చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు….  తహశీల్దార్ ఆదేశాలతో పొక్లెయినర్ సహాయంతో బరిని ధ్వంసం చేశారు. 

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో సంక్రాంతి సంర్భంగా కోడిపందాల బరులు సిద్ధమయ్యాయి. సంవత్సరానికి ఒకసారి వచ్చే కోడిపందాలను వీక్షించడానికి దూర ప్రాంతాలనుంచి బంధువులు, స్నేహితులు వస్తుంటారని.. సరదాకోసం ఆడే కోడిపందాలను నిషేదించడం సరికాదంటున్నారు ప్రజలు. కనీసం డింకీ పందాలను నిర్వహించుకునే వెసులుబాటైనా కల్పించాలని కోరుతున్నారు.