హైదరాబాద్ నుంచి మేడారానికి 500 బస్సులు

తెలంగాణలో అతి పెద్ద గిరిజన సంబురాలు మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ఆర్టీసీ రెడీ అయిపోయింది. ఈ సందర్భంగా 500ప్రత్యేక బస్సులను కేటాయించారు. హైదరాబాద్‌లోని పలు కీలక జంక్షన్ల నుంచి బస్సులు బయల్దేరనున్నాయని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వరప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఎంజీబీఎస్ లో మీడియాతో మాట్లాడుతూ.. ఆన్‌లైన్ సేవలను సద్వినియోగపరచుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రపంచంలోనే అతిపెద్ద మేడారం జాతరకు గతేడాది కంటే ఎక్కువ బస్సులు నడపనున్నాం. 375 బస్సుల నుంచి 500 వరకూ బస్సులు నడిపిస్తాం. జాతర నిర్వహించే ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు 500 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంటాయి. మెయిన్ బస్‌స్టాప్‌లు అయిన MGBS, JBS, DILSUKHNAGAR, UPPAL X ROAD, JAGADGIRIGUTTA, KPHB, MIYAPUR, LINGAMPALLY, LALA DARWAJA MAHANKALI TEMPLE పాయింట్ల నుంచి ప్రత్యేక బస్సులు ఉంటాయి.
డిపో మేనేజర్‌స్థాయి అధికారులు మేడారంలోని ప్రత్యేక పాయింట్లలో ఉండి ప్రయాణికుల సౌకర్యాలు చూస్తారని తెలిపారు. ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ సౌకర్యాన్ని ప్రయాణికులు వినియోగించుకోవచ్చని అన్నారు. అంతేకాకుండా నగరంలో ఏ ఒక్క ప్రాంతం నుంచైనా 50మంది ప్రయాణికులు మేడారం జాతరకు వెళ్లాలనుకుంటే అక్కడి నుంచే బస్సు నడిపేందుకు సిద్ధంగా ఉణ్నట్లు తెలిపారు.
జనవరి 26న మేడారానికి అధికంగా భక్తులు వెళ్తున్నందున నగరంలోని అన్ని పాయింట్ల నుంచి 40 ప్రత్యేక బస్సులను నడుస్తాయని చెప్పారు. మేడారం జాతరకు ఫిబ్రవరి 2న 30 బస్సులు, 3న 35, 4న 40, 5న 100, 6న 120, 7న 140, 8న 35 బస్సులను నడుపుతామని ఆర్‌ఎం వరప్రసాద్ తెలిపారు. ఆన్‌లైన్ టిక్కెట్ రిజర్వేషన్ కోసం www.tsrtconline.in వెబ్‌సైట్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.
టిక్కెట్ల వివరాలిలా:
బస్సు | MGBS, JBS, UPPAL నుంచి | ఇతర పాయింట్ల నుంచి | ||
---|---|---|---|---|
పెద్దలకు | పిల్లలకు | పెద్దలకు | పిల్లలకు | |
ఎక్స్‌ప్రెస్ | 440 | 230 | 460 | 240 |
డీలక్స్ | 480 | 250 | 510 | 260 |
సూపర్ లగ్జరీ | 550 | 290 | 580 | 300 |
రాజధాని ఏసీ | 710 | 540 | 750 | 570 |
గరుడ ప్లస్ ఏసీ | 860 | 660 | 910 | 690 |