జనసేనకు షాక్ : ఆకుల సత్యనారాయణ గుడ్ బై

ఏపీలో జనసేన పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. అధికారంలోకి వస్తామని ధీమాగా చెప్పిన ఆ పార్టీ ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ సైతం ఓటమి పాలయ్యారు. దీంతో పార్టీ లీడర్స్ ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజీనామా చేశారు. మాజీ ఎమ్మెల్యే, జనసేన నేత ఆకుల సత్యనారాయణ వారి బాటలోనే పయనించారు. పార్టీకి గుడ్ బై చెప్పారు. అక్టోబర్ 05వ తేదీ శనివారం రాజీనామా పత్రాన్ని పార్టీ ఆఫీసుకు పంపించారు. ఈయన వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే సీఎం జగన్‌ను కలువనున్నట్లు టాక్.
ఇక ఆకుల సత్యనారాయణ విషయానికి వస్తే… 2014 ఎన్నికల్లో బీజేపీ తరపున రాజమండ్రి నియోజకవర్గం నుంచి ఆకుల సత్యనారాయణ ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు. ఈయనకు రాజమండ్రి లోక్ సభ స్థానం కేటాయించారు పవన్ కళ్యాణ్. కానీ ఆయన ఎన్నికల్లో ఘోర ఓటమి చెందారు. ఇక అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆయన పార్టీ మారుతారని అప్పట్లోనే ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ తీరుపై అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈయన కాపు సామాజిక వర్గానికి చెందిన లీడర్. ఉభయ గోదావర జిల్లాల్లో బలమైన సామాజిక వర్గంగా కాపులున్నారు. వీరు వైసీపీలో చేరితే..పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆ పార్టీ లీడర్స్ భావిస్తున్నారు. జనసేన పార్టీ నేతలు రావెల కిశోర్ బాబు, చింతల పార్థసారధి, మారంశెట్టి రాఘవయ్య, అద్దేపల్లి శ్రీధర్ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ద్వితీయ శ్రేణి నాయకులు పెద్ద సంఖ్యలో మారుతుండడం..వలసలు జనసేన పార్టీని ఆందోళనకు గురి చేస్తున్నాయి.
Read More : వైసీపీ ఎమ్మెల్యే రోజా జీతం రూ.3.82 లక్షలు