విమర్శలే కారణమా: నారా లోకేష్‌కు పోటీగా బరిలోకి జనసేన

  • Published By: vamsi ,Published On : March 25, 2019 / 04:30 AM IST
విమర్శలే కారణమా: నారా లోకేష్‌కు పోటీగా బరిలోకి జనసేన

Updated On : March 25, 2019 / 4:30 AM IST

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలవేళ గుంటూరు జిల్లా మంగళగిరి స్థానంపై చర్చలు ప్రముఖంగా నడుస్తున్నాయి. అందుకు కారణం ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం యువనేత, నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ బరిలో నిలవడమే. ఈ నియోజకవర్గం నుంచి జనసేన పోటీలో లేకుండా సీపీఐకి సీటును కేటాయించింది. ఈ క్రమంలో చంద్రబాబుకు పవన్‌కు మధ్య ఉన్న పొత్తులో భాగంగానే జనసేన ఇక్కడి నుంచి పోటీ చేయలేదంటూ వైసీపీ విమర్శలు కురిపించిన నేపథ్యంలో నామినేషన్ల దాఖలుకు చివరిరోజు జనసేన పార్టీ అనూహ్యంగా కీలక నిర్ణయం తీసుకుంది.
Read Also : పవన్‌కు పృథ్వీ వార్నింగ్: పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు

జనసేన తరఫున నియోజకవర్గం నుంచి చల్లపల్లి శ్రీనివాస్‌‌ నామినేషన్‌ వేయనున్నట్లు ప్రకటించింది. పొత్తుల్లో భాగంగా సీపీఐ తరఫున ముప్పాళ్ల నాగేశ్వరరావు నామినేషన్‌ వేసేందుకు సిద్ధమవుతుండగా చల్లపల్లి శ్రీనివాస్‌కు జనసేన  బీ-ఫారం ఇచ్చింది.

కాగా గతంలో ప్రజారాజ్యం పోటీ చేసినప్పుడు 39,823ఓట్లతో ప్రజారాజ్యం తరుపున తమ్మిశెట్టి జానకీ దేవి రెండవ స్థానంలో నిలవగా.. జనసేనకు బలం ఉందని సీపీఐని పక్కనబెట్టి జనసేన బరిలోకి దిగింది. ఈ స్థానం నుండి ఇప్పటికే టీడీపీ తరఫున నారా లోకేశ్‌, వైసీపీ తరఫున ఆళ్ల రామకృష్ణారెడ్డి బరిలో ఉన్నారు. 
Read Also : పవన్ స్టైల్ : పంచెకట్టు..వేపచెట్టు..మట్టి ముంతలో మజ్జిగన్నం