డిసైడింగ్ ఫ్యాక్టర్ : జహీరాబాద్ విజేతను నిర్ధారించేది కామారెడ్డి జిల్లా

  • Published By: madhu ,Published On : March 18, 2019 / 02:39 PM IST
డిసైడింగ్ ఫ్యాక్టర్ : జహీరాబాద్ విజేతను నిర్ధారించేది కామారెడ్డి జిల్లా

Updated On : March 18, 2019 / 2:39 PM IST

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. అభ్యర్థులపై కసరత్తు చేస్తున్న పార్టీలు… గెలుపు ఓటములను నిర్ధారించే సెగ్మెంట్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. ఈ క్రమంలోనే జహిరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పైనా కసరత్తు చేస్తున్నాయి పార్టీలు. ప్రస్తుతం బీబీ పాటిల్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నా… ఈసారి జరిగే ఎన్నికల్లో విజేతను నిర్ధారించేది మాత్రం కామారెడ్డి జిల్లానే అంటున్నారు విశ్లేషకులు. 
Read Also : వెరీ గుడ్ న్యూస్ : 20 నుంచి హైటెక్ సిటీ మెట్రో సర్వీసులు

జహిరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోకి వస్తుంది. కామారెడ్డి జిల్లా నుంచి కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గాలు. సంగారెడ్డి జిల్లా నుంచి జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గాలు. అయితే.. మెజారిటీ ఓట్లు కామారెడ్డి జిల్లా నుంచి పడితేనే అభ్యర్థి గెలుపు ఖాయమవుతుంది. ఎందుకంటే… కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌, బాన్సువాడ నియోజకవర్గాలను కలుపుకొని మొత్తం 8లక్షల 12వేల 301 ఓట్లు ఉన్నాయి. ఇందులో మహిళా ఓటర్లు 4లక్షల 19వేల 356 మంది ఉండగా… పురుషులు 3లక్షల 92వేల 898 మంది ఉన్నారు.

జహీరాబాద్ ఎంపీ స్థానాన్ని గెల్చుకోవాలంటే కామారెడ్డి జిల్లా పరిధి నుంచి మహిళా ఓటర్లు కీలకం అయ్యే అవకాశాలున్నాయి. జహిరాబాద్‌ను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి. అయితే.. నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్‌కు చెందిన వారే కావడంతో… ఆ పార్టీ అభ్యర్థి విజయం సాధించడం ఈజీ అనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు.. ఇటీవలే సన్నాహక సమావేశం నిర్వహించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా… పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 
Read Also : జైలుకెళ్లను బిడ్డో : ఒకేసారి రూ.462 కోట్లు కట్టిన అంబానీ