KXIPvsMI: డికాక్ హాఫ్ సెంచరీ, పంజాబ్ టార్గెట్ 177

పంజాబ్‌లోని మొహాలీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై బ్యాట్స్‌మెన్‌ను పంజాబ్ బౌలర్లు ఘోరంగా కట్టడి చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై 7వికెట్లు నష్టపోయి పంజాబ్ కు 177 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. ముంబై జట్టులో క్వింటాన్ డికాక్ (60; 39 బంతుల్లో 6ఫోర్లు, 2 సిక్సులు)తో పరవాలేదనిపించే స్కోరు చేశాడు.
మిగిలినవారంతా రోహిత్ శర్మ(32), సూర్యకుమార్ యాదవ్(11), యువరాజ్ సింగ్(11), కీరన్ పొలార్డ్(7), కృనాల్ పాండ్యా(10), హార్దిక్ పాండ్యా(31), మిచెల్(0), మయాంక్ మార్కండే(0) తో సరిపెట్టుకున్నారు. పంజాబ్ బౌలర్లు షమీ(2), హార్దస్(2), ఆండ్రూ టై(1), మురుగన్ అశ్విన్(2) వికెట్లు పడగొట్టారు.