KXIPvsMI: ‘పంజా’బ్ దెబ్బకి మునిగిపోయిన ముంబై

ఐపీఎల్‌లో భాగంగా పంజాబ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. 177 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన పంజాబ్ బ్యాట్స్‌మెన్ ముంబై ఇండియన్స్‌కు చుక్కలు చూపించారు. కేఎల్ రాహుల్(71; 57 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సు) అద్భుతంగా రాణించడంతో జట్టు విజయతీరాలకు చేరింది. క్రిస్ గేల్(40), మయాంక్ అగర్వాల్(43), డేవిడ్ మిల్లర్(15)లు రాణించి ముంబైపై సత్తా చాటారు.
కేఎల్ రాహుల్ ఓపెనర్ గా దిగి అద్భుతమైన ఫామ్ పుంజుకున్నాడు. దీంతో లీగ్‌లో పంజాబ్ ఖాతాలో 2 విజయాలు నమోదైయ్యాయి.
అంతకంటే ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై 7వికెట్లు నష్టపోయి పంజాబ్ కు 177 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. ముంబై జట్టులో క్వింటాన్ డికాక్ (60; 39 బంతుల్లో 6ఫోర్లు, 2 సిక్సులు)తో పరవాలేదనిపించే స్కోరు చేశాడు.
మిగిలినవారంతా రోహిత్ శర్మ(32), సూర్యకుమార్ యాదవ్(11), యువరాజ్ సింగ్(11), కీరన్ పొలార్డ్(7), కృనాల్ పాండ్యా(10), హార్దిక్ పాండ్యా(31), మిచెల్(0), మయాంక్ మార్కండే(0) తో సరిపెట్టుకున్నారు. పంజాబ్ బౌలర్లు షమీ(2), హార్దస్(2), ఆండ్రూ టై(1), మురుగన్ అశ్విన్(2) వికెట్లు పడగొట్టారు.