పేదలకు బంపర్ ఆఫర్ : రూపాయికే రిజిస్ట్రేషన్

  • Published By: madhu ,Published On : October 18, 2019 / 02:09 AM IST
పేదలకు బంపర్ ఆఫర్ : రూపాయికే రిజిస్ట్రేషన్

Updated On : October 18, 2019 / 2:09 AM IST

పేదలకు సీఎం జగన్ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రెండు సెంట్లలోపు వరకు మొత్తం రూపాయికే రిజిస్ట్రేషన్ చేయాలని జగన్ ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లోని అభ్యంతరాల్లేని అక్రమ నిర్మాణాలను క్రమబద్దీకరించే విషయంలో ఈ నిర్ణయం తీసుకుంది. అంతకుమించితే క్రమబద్దీకరణ ఫీజు ఎంత ఉండాలన్న దానిపై ప్రతిపాదనలు రూపొందించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉగాది నాటికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చే విషయంలో 2019, అక్టోబర్ 18వ తేదీ గురువారం సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. 

నదీ తీరాల వెంబడి, కాల్వగట్ల వెంబడి ఉన్న ఇళ్ల కారణంగా ప్రజల ప్రాణాలకు తీవ్ర ముప్పు ఉన్న నేపథ్యంలో స్థలాలు, ఇళ్ల కేటాయింపులో ఇక్కడి వారికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. స్థలం ఇచ్చినా..రిజిస్ట్రేషన్ చేసే వారు కాదని, ఇప్పుడు చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణాలకు వీలైనంత మేర ప్రభుత్వ స్థలాలనే వాడుకోవాలని, ఇళ్ల స్థలాలు పొందే లబ్దిదారుల జాబితాలను విధిగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలన్నారు. జాబితా కింద దరఖాస్తులు ఎవరికి చేయాలి, ఎలా చేయాలి, ఎవరిని సంప్రదించాలని వంటి సూచనలు కూడా ఇవ్వాలన్నారు.

ఇళ్ల స్థలాల కోసం ఎవరికైనా అర్హత లేకపోతే..అందుకు గల కారణాలను కూడా వారికి తెలియచేయాలన్నారు. అర్హత ఉన్న ప్రతొక్కరికీ ఇళ్ల పట్టాలిచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని, లబ్దిదారుల నుంచి జనవరి వరకు దరఖాస్తులు స్వీకరించాలన్నారు. ఉగాది నాటికి రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలందరికీ ఉచితంగా ఇళ్ల స్థలాలు అందించాలని సీఎం జగన్ నిర్ణయించడం జరిగిందని సమావేశం అనంతరం మీడియాకు మంత్రి బోత్స సత్యనారాయణ తెలిపారు. ఇళ్ల కోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటి వరరూ. 20 లక్షల 47 వేల 325 లబ్దిదారులను గుర్తించడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల కోసం 19 వేల 389 ఎకరాలను గుర్తించినట్లు, ఇంకా 8 వేల ఎకరాలు అవసరమౌతాయని అంచనా వేయడం జరగిందన్నారు. ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్దిదారులకు అందచేస్తామన్నారు మంత్రి బోత్స. 
Read More : విశాఖ భూ కుంభకోణం : సీఎం జగన్ కీలక నిర్ణయం