అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్ : ఏపీకి మూడు రాజధానులు..!?
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై అసెంబ్లీలో సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. ఏపీలో మూడు రాజధానుల అవసరం ఉందన్నారు. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలులో హైకోర్టు, జ్యుడీషియల్ కేపిటల్ ఏర్పాటు చేయొచ్చన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై అసెంబ్లీలో సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. ఏపీలో మూడు రాజధానుల అవసరం ఉందన్నారు. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలులో హైకోర్టు, జ్యుడీషియల్ కేపిటల్ ఏర్పాటు చేయొచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై అసెంబ్లీలో సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. ఏపీలో మూడు రాజధానుల అవసరం ఉందన్నారు. మంగళవారం(డిసెంబర్ 17,2019) అసెంబ్లీలో అమరావతి రాజధానిపై వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఏపీకి మూడు రాజధానులు వస్తాయేమోనని సంచలన వ్యాఖ్యాలు చేశారు. పాలన ఒక చోట, జ్యుడీషియల్ మరో చోట ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలులో హైకోర్టు, జ్యుడీషియల్ కేపిటల్ ఏర్పాటు చేయొచ్చన్నారు.
ఏపీ రాజధానిపై పరిశీలించేందుకు నిపుణుల కమిటీ వేశామని..వారం రోజుల్లో నివేదిక ఇస్తుందని సీఎం జగన్ చెప్పారు. ఏపీకి బహుశా మూడు రాజధానులు ఉంటాయేమోనని అన్నారు. కమిటీ నివేదిక వచ్చాక రాజధాని అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయని గుర్తు చేశారు. ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే తప్పేంటని సీఎం జగన్ ప్రశ్నించారు. పరిపాలన వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక విభజిత ఆంధ్రప్రదేశ్ కు అప్పటి సీఎం చంద్రబాబు అమరావతి రాజధానిని ఏర్పాటు చేశారు. రాజధాని నిర్మాణ బాధ్యతలను సింగపూర్ కంపెనీకి అప్పగించింది. అమరావతిలోనే అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు ఏర్పాటు చేశారు. అయితే సీఎం జగన్ ఇవాళ అసెంబ్లీలో చేసిన ప్రకటనతో ఒకే దగ్గర ఉన్న అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలులో జ్యుడీషియల్ కేపిటల్, హైకోర్టు ఏర్పాటు కాబోతున్నాయి. ఏపీలో పాలన వికేంద్రీకరణ జరుగనుంది.
టీడీపీ ప్రభుత్వం హయాంలో రాజధాని అమరావతి నిర్మాణం రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా తీవ్రమైన చర్చకు దారి తీసింది. చంద్రబాబు ప్రభుత్వంలో పురుడు పోసుకున్న అమరావతి అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా టాక్ ఆఫ్ ది పాలిటిక్స్‌గా నడిచింది. సింగపూర్ సహా దుబాయ్ వంటి దేశాల నమూనాలను పరిశీలించి మరీ అమరావతిలో మరో ప్రపంచాన్ని సృష్టించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. ఇక, ఇక్కడ భూ సేకరణ పెద్ద చర్చకు దారీ తీసింది.
అయితే అమరావతిని మార్చితే.. జగన్ విమర్శలను ఎదుర్కొనక తప్పదనే వ్యాఖ్యలు వినిపించాయి. అయితే ఇదే విషయంలో రాజధానిగా అమరావతిని మార్చేందుకు ఇష్టపడని జగన్ పరిపాలను వికేంద్రీకరణ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీకి మూడు రాజధానులు అవసరమని, మూడు రాజధానులు ఉంటాయేమోనని అన్నారు.