జగన్ జపం : తిరుమల కొండపై నినాదాలు

  • Published By: madhu ,Published On : January 10, 2019 / 10:28 AM IST
జగన్ జపం : తిరుమల కొండపై నినాదాలు

చిత్తూరు : ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల కొండ ఎక్కుతుంటే మీకు ఎలాంటి నామాలు వినిపిస్తాయి…గోవింద నామస్మరణ అంటారు..కదా…కానీ జనవరి 10వ తేదీ మాత్రం జై జగన్..సీఎం జగన్ అనే నినాదాలు మిన్నంటాయి. తిరుమల కొండపై ఎలాంటి రాజకీయాలు….గోవింద నామ స్మరణ తప్ప ఎలాంటి నినాదాలు చేయవద్దని టీటీడీ ఆంక్షలు విధించింది. అయితే వైసీపీ కార్యకర్తలు పై విధంగా స్లోగన్స్ చేయడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిని సాకుగా చూపెట్టి వైసీపీపై అధికారపక్షం విమర్శలు చేసే అవకాశం ఉంది. 
అలిపిరి వద్దకు జగన్…
సుదీర్ఘ పాదయాత్ర చేసిన అనంతరం వైఎస్ జగన్…తిరుమల శ్రీ వారిని దర్శించుకొనేందుకు జనవరి 10వ తేదీ వచ్చారు. కాలినడకన ఆయన బయలుదేరారు. జగన్ వస్తున్నాడని తెలుసుకున్న కార్యకర్తలు..అభిమానులు పోటెత్తారు. కొబ్బరికాయలు కొట్టారు. కేరింతలతో ఆ ప్రాంతం అంతా సందడి నెలకొంది. జగన్ వాహనం దిగగానే ఒక్కసారిగా కార్యకర్తలకు ఎక్కడలేని జోష్ వచ్చేసింది. తాము ఎక్కడున్నామో మరిచిపోయారు. నోటికి పని చెప్పారు. జై జగన్..జై జై జగన్…అంటూ నినాదాలు చేశారు. ఇదంతా చూస్తున్న వైసీపీ సీనియర్ నేతలు వద్దు వద్దూ అంటూ ఆపే ప్రయత్నం చేశారు. అయినా వింటారా అభిమానులు…పాదాల మండపం వద్దకు చేరుకోగానే ఈ స్లోగన్స్ మరింత ఎక్కువయ్యాయి. సీఎం జగన్…సీఎం జగన్..అంటూ నినాదాలు చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.