ఈ బ్రిడ్జ్ కి ముగ్గురు సీఎంలు శంకుస్థాపన : ఇప్పటికీ పూర్తవ్వనేలేదు 

  • Published By: veegamteam ,Published On : September 21, 2019 / 11:16 AM IST
ఈ బ్రిడ్జ్ కి ముగ్గురు సీఎంలు శంకుస్థాపన : ఇప్పటికీ పూర్తవ్వనేలేదు 

Updated On : September 21, 2019 / 11:16 AM IST

గోదావరి తీరప్రాంతం కోనసీమ. అందాలకు నెలవు. ఆంధ్రా కేరళగా పేరు. ఉభయ గోదావరి జిల్లాలను కలిపే వంతెల కొరత మాత్రం కోనసీమలో దశాబ్దాలుగా అలాగే ఉండిపోయింది. దీంతో పశ్చిమగోదవరి జిల్లాలోని నర్సాపురం నుంచి  తూర్పు గోదవరి జిల్లాలోని సఖినేటిపల్లి వెళ్లాలంటే కోనసీమ వాసులకు పంటి కటే దారి. పంటి అంటే నీటిలో నడిచే పెద్ద పవవలాంటిది. లాంచ్ కంటే చిన్నది..పడవ కంటే పెద్దగా ఉంటుంది ఈ పంటి. సాధారణంగా పెద్ద పెద్ద కాలువల్ని..నదీ పాయల్ని దాటటానికి బల్లకట్టు..పంటిలను వినియోగిస్తారు.ఈ పంటిపై ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ రెండు జిల్లాల మధ్య జరిగే ప్రయాణంలో పలు ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పంటులపై ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. 

నర్సాపురం-సఖినేటి పల్లిలను కలిపేందుకు ఓ బ్రిడ్జీ నిర్మాణానికి ముగ్గురు సీఎంలు శంకుస్థాపన చేశారు. కానీ ఈనాటికీ ఆ బ్రిడ్జి నిర్మాణం జరగనేలేదు. దీంతో ఆ ప్రాంత వాసులు గోదావరి దాటాలంటే వేరే దారి లేక పంటులనే ఆశ్రయిస్తున్నారు.

ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ నర్సాపురం-సకినేటిపల్లి బ్రిడ్జి వంతెన నిర్మాణానికి ఒక్కరాయి కూడా పడలేదు. దీంతో ఎన్నికల వాగ్ధానంలో సీఎం జగన్ ఈ బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చారనీ వెంటనే బ్రిడ్జి నిర్మాలని డిమాండ్ చేస్తున్నారు కోనసీమ వాసులు. వీరు గోదావరి దాటాంటే వారి వాహనాలతో సహా పంటి మీదనే ప్రయాణిస్తుంటారు. సైకిళ్లు, మోటార్ సైకిళ్లు, ఆఖరికి జంతువుల్ని కూడా ఈ పంటి మీదనే తరలిస్తుంటారు. 

పశ్చిమ – తూర్పు జిల్లాలను వేరు చేస్తున్న వశిష్ట గోదావరిపై బ్రిడ్జి నిర్మించాలనే డిమాండ్ ఏనాటి నుంచో కొనసాగుతోంది. దివంగత సీఎంలు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లతో పాటు మాజీ సీఎం చంద్రబాబు ఈ బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటి వరకూ నిర్మాణం కాదు కదా ఆ దిశగా చర్యలు కూడా జరగలేదు. హామీలన్నీ శిలాఫలకాలకు మాత్రమే పరిమితమైందని స్థానికులు విమర్శిస్తున్నారు. 

గతంతో ఈ బ్రిడ్జి నిర్మాణానికి దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి ఓ కంపెనీ కాంట్రాక్ట్ కు ఇచ్చింది. నిర్మాణ పనులు చేపట్టమని ఆదేశాలు కూడా జారీ చేసింది. కానీ అంతలోనే రాజశేఖర్ అకాలమరణంతో ఆ నిర్మాణం ఆగిపోయింది.  ఈ క్రమంలో ఈ బ్రిడ్జిని నిర్మిస్తామని హామీలు ఇచ్చినా జరగలేదు. ఈ క్రమంలో సీఎం  జగన్ ఎన్నికల ప్రచారంలో ఇరు జిల్లాల ప్రజలకు ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

దీంతో ఇప్పటికైనా నర్సాపురం-సఖినేటిపల్లి మధ్య వశిష్ట గోదావరిపై బ్రిజ్జిని నిర్మించాలని ఇరు జిల్లాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాగా..కచ్చులూరు బోటు ప్రమాదం జరిగిన క్రమంలో పంటులపై ప్రయాణించాలంటే స్థానికులు హడలిపోతున్నారు. ఇటువంటి ప్రమాదాలు జరగకూడదంటే బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రభుత్వం వెంటనే చేపట్టాలని..సీఎం జగన్ ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.