దారుణం : చేతబడి అనుమానంతో సజీవదహనం
మేడ్చల్ లో దారుణం జరిగింది. చేతబడి చేశాడనే అనుమానంతో ఓ యువకుడిని దారుణంగా కొట్టారు. అంతటితో వారు కోపం చల్లారలేదు. ఆ యువకుడిని సజీవ దహనం చేశారు.

మేడ్చల్ లో దారుణం జరిగింది. చేతబడి చేశాడనే అనుమానంతో ఓ యువకుడిని దారుణంగా కొట్టారు. అంతటితో వారు కోపం చల్లారలేదు. ఆ యువకుడిని సజీవ దహనం చేశారు.
మేడ్చల్ లో దారుణం జరిగింది. చేతబడి చేశాడనే అనుమానంతో ఓ యువకుడిని దారుణంగా కొట్టారు. అంతటితో వారి కోపం చల్లారలేదు. ఆ యువకుడిని సజీవ దహనం చేశారు. శామీర్ పేట ఆద్రాస్ పల్లిలో ఈ ఘోరం జరిగింది. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మి అనే మహిళ మృతి చెందింది. బంధువులు ఆమె దహన సంస్కారాలు చేశారు. లక్ష్మి దహన సంస్కారాలు జరిగిన ప్రాంతానికి ఆంజనేయులు వెళ్లాడు. దీంతో లక్ష్మి బంధువులకు అతడిపై అనుమానం వచ్చింది. ఆంజనేయులు చేతబడి చేయడంతోనే లక్ష్మి చనిపోయిందని డౌట్ పడ్డారు. అంతే వారిలో కోపం కట్టలు తెంచుకుంది. ఆవేశంతో ఆంజనేయులుని కర్రలతో చితక్కొట్టారు. ఆ తర్వాత సజీవ దహనం చేశారు.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉద్రిక్తతలకు దారితీసింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాఫ్తు చేపట్టారు. అసలేం జరిగింది అనే వివరాలు సేకరిస్తున్నారు. దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా, ఈ రోజుల్లో మూఢనమ్మకాలు ఏంటని జనవిజ్ఞాన వేదిక సభ్యులు ప్రశ్నిస్తున్నారు. చేతబడి లాంటివి నమ్మొద్దని ప్రజలను కోరారు. అలాంటివేవీ లేవని చెప్పారు. లేని పోని అనుమానాలతో ప్రాణాలు తీయొద్దన్నారు.