తిట్టేది అభిమానంతో.. కొట్టేది ప్రేమతో : బాలయ్య భార్య వసుంధర
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ అభిమానులతో వ్యవహరించే తీరు వివాదాస్పదం అవుతుంది.

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ అభిమానులతో వ్యవహరించే తీరు వివాదాస్పదం అవుతుంది.
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ అభిమానులతో వ్యవహరించే తీరు వివాదాస్పదం అవుతుంది. ఫ్యాన్స్, కార్యకర్తలతో దురుసుగా మాట్లాడటం, కొట్టటం వంటివి చేస్తుంటారు. నోరు పారేసుకోవటం మామూలే. గతంలో కడుపు చేసేయాలంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. హిందూపూర్ ఎన్నికల ప్రచారంలోనూ ఇదే ధోరణితో దూసుకెళ్లిపోతున్నారు ఎమ్మెల్యే బాలయ్య. ఈ క్రమంలో విజయనగరంలోని చీపురుపల్లిలో కార్యకర్తను పరిగెత్తించి కొట్టాడు. ఈ ఘటనపై బాలయ్య భార్య వసుంధరా స్పందించారు. మా ఆయన ఎప్పుడు అంతే.. తన అభిమానులతో ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారని తేలిగ్గా తీసిపారేశారు వసుంధర.
Read Also : BJP హామీలు : రైతులకు క్రెడిట్ కార్డులు, పెన్షన్లు, రూ.6వేల సాయం
ఫ్యాన్స్ శృతిమించి వ్యవహరించినా.. తప్పుగా ప్రవర్తించినా ఆయనకు వెంటనే కోపం వచ్చేస్తుందన్నారు. క్రమశిక్షణతో లేకపోతే ఆవేశం ఆపుకోలేరని, కోపం వస్తుందని చెబుతున్నారు. ఆయన తిట్టేది, కొట్టేది అభిమానులు, కార్యకర్తలపై ప్రేమతోనే అని చెప్పుకొచ్చారు వసుంధర. అభిమానులతో ఉన్న చనువు.. నా వాళ్లు అనే భావనతోను బాలయ్య అలా వ్యవహరిస్తుంటారని.. ఇది పెద్ద విషయం కాదన్నారు.
బాలయ్య ఏమన్నా అన్నా.. కొట్టినా ఫ్యాన్స్‌కూడా ఏమీ అనుకోరని సమర్ధించుకున్నారు వసుంధర. మా ఆయనంటే పడనివాళ్లు మాత్రమే దీన్ని రాజకీయం చేస్తున్నార ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి ఇది పెద్ద విషయం కాదన్నారు. ఆ మాట ఆయన అభిమానులకు అలవాటేనని అన్నారు వసుంధర. ఇటువంటివాటిని హైలైట్ చేసి ప్రచారం చేస్తున్నారని వసుంధరాదేవి విమర్శించారు. ప్రజలు కష్టాల్లో ఉంటే బాలకృష్ణ తట్టుకోలేరన్నారని.. అందుకే ట్రస్ట్ ద్వారా క్యాన్సర్ రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందేలా చూస్తారని తెలిపారు.
Read Also : రేపటి రౌడీలు : కత్తులతో కేక్ కట్ చేసిన స్టూడెంట్స్