కసాయి తల్లి : ఐదేళ్ల కొడుకుని విషమిచ్చి చంపింది

కన్నబిడ్డకు చిన్న దెబ్బ తగిలినా తల్లిడిల్లిపోయే తల్లి ఘాతుకానికి పాల్పడింది. కన్నతల్లే చిన్నారి పాలిట మృత్యు దేవతగా మారింది. నవ మాసాలు మోసి కన్నబిడ్డను కడతేర్చింది. బిడ్డకు పాలు పట్టించాల్సిన చేతులతో విషయం తాగించింది. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వర్కాలలో ఈ దారుణం చోటు చేసుకుంది.
ఐదేళ్ల కుమారుడు జశ్వంత్‌రెడ్డికి తల్లి శివరాణి విషయం తాగించింది. చిన్నారి ప్రాణం తట్టుకోలేకపోయింది. విషం ఒళ్లంతా పాకింది. దీంతో జశ్వంత్‌రెడ్డి మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అనంతరం తల్లి శివరాణికి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా..బంధువులను ప్రశ్నించారు. కుటుంబ కలహాలే కారణమని బంధువులు చెబుతున్నారు.